తక్కువ ధరలో మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్న వారికి శుభవార్త. Lenovo సంస్థ కొద్దిసేపటి క్రితం Lenovo Vibe K5 స్మార్ట్‌ఫోన్‌ని రూ. 6,999కి విడుదల చేసింది. అమెజాన్‌లో వచ్చే వారం ఫ్లాష్ సేల్ ద్వారా ఈ ఫోన్‌ని కొనుగోలు చెయ్యవచ్చు. ఈ ఫోన్ గోల్డ్, సిల్వర్, గ్రే కలర్స్‌లో లభిస్తుంది.

వాస్తవానికి Lenovo Vibe K5 మోడల్ Vibe K5 Plusతో పాటు 2016 మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లోనే విడుదల చెయ్యబడింది. Vibe K5 Plus మోడల్ మార్చి నెలలో రూ. 8,499కి ఇండియాలో అందుబాటులోకి వచ్చింది. తాజాగా Vibe K5 మోడల్‌ని Lenovo విడుదల చేసింది.

ఈరోజు విడుదలైన Lenovo Vibe K5 మోడల్‌లో Android 5.1 ఆపరేటింగ్ సిస్టమ్, 5 అంగుళాల 720x 1280 pixels డిస్‌ప్లే, 12. GHz octa-core Qualcomm Snapdragon 415 ప్రాసెసర్, 2GB మొత్తంలో RAM ఈ ఫోన్లో లభిస్తున్నాయి. ఫోన్ వెనుక కెమెరా విషయానికి వస్తే 13 MP కెమెరా, LED ఫ్లాష్, సెల్ఫీల షూటింగ్ కోసం 5 MP ఫ్రంట్ కెమెరా అమర్చబడ్డాయి.

ఇంటర్నల్ స్టోరేజ్ పరంగా చూస్తే 16 GB ఇంటర్నల్ స్టోరేజ్, 32 GB వరకూ microSD ద్వారా స్టోరేజ్‌ని పెంచుకునే సౌలభ్యం లభిస్తోంది. ఈ ఫోన్లో 2750 mAh బ్యాటరీ అమర్చబడింది. WiFi, GPS, Bluetooth, FM, 3G, 4G (భారతీయ LTE నెట్‌వర్క్‌లను సపోర్ట్ చేసే విధంగా) నెట్‌వర్క్‌లను సపోర్ట్ చేస్తున్న ఈ ఫోన్ మోడల్ ప్రాక్జిమిటీ సెన్సార్, లైట్ సెన్సార్, accelerometer, gyroscope తదితర సెన్సార్లని కూడా అందిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: