ఐ ఫోన్ 7 ఇప్పుడు ఎక్కడ చూసినా దీని గురించి భారీ చర్చ నడుస్తోంది. ఎప్పుడెప్పుడు మార్కెట్ లోకి వస్తుందా అని ఐ ఫోన్ ప్రియులు ఎదురు చూస్తూ ఉండగా అదేమీ రేటు రా బాబూ అని ఇతరులు కంగారు పడుతున్నారు. పోయిన వారం లో విడుదల అయిన యాపిల్ ఐ ఫోన్ 7, 7 ప్లస్ ఇప్పుడు ముందస్తు బుకింగ్ లలో బిజీ అయ్యాయి. ఈ ఫోన్ ధరల విషయం లో కస్టమర్ లు చాలా సందిగ్ధత లో పడ్డారు. అమెరికాలో అతి తక్కువగా (32 జీబీ వర్షన్) రూ. 43,400కు (649 డాలర్లు) లభిస్తున్న ఫోన్, ఇండియాలో మాత్రం రూ. 60 వేలుగా ఉండటం గమనార్హం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివిధ దేశాల ధరలతో పోలిస్తే, ఇండియాలోనే ధర అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది.  మరొక పక్క కేనదాలు 46 వేలు ఉన్న ఈ ఫోను దుబాయ్ లో 47 వేలకి దొరుకుతుంది. జపాన్ లో కూడా 47 వేలకి ఇస్తున్నారు. హాంకాంగ్ లో రూ. 48,200 (5,588 హాంకాంగ్ డాలర్లు), సింగపూర్ లో రూ.51,600 (1,048 సింగపూర్ డాలర్లు)కు లభిస్తోంది. భారత్ లోనే అందరికంటే ఎక్కువ రేటు లో ఈ ఫోన్ కొనాల్సిన పరిస్థితి నెలకొంది. యూకే , చైనా , ఆస్ట్రేలియా, జర్మనీ, స్పెయిన్, నెదర్లాండ్స్, ఫ్రాన్స్, న్యూజిలాండ్, స్వీడన్, ఐస్ ల్యాండ్, పోర్చుగల్, ఆస్ట్రియా తదితర దేశాలు అన్నిట్లో భారత్ కంటే ధర చాలా తక్కువగా ఉంది.   


మరింత సమాచారం తెలుసుకోండి: