సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ ఇప్పుడు మనందరికీ సూపర్ గా అలవాటు. ఉదయం లేచిన దగ్గర నుంచీ మనోళ్ళు దాదాపు అదే పనిలో ఉంటారు కానీ ఇపుడు మరొక కొత్త ఫీచర్ తో మనల్ని ఫేస్ బుక్ ఇంకా బాగా నచ్చబోతోంది. ఫేస్‌బుక్ ఇకపై త‌మ వెబ్‌సైట్‌లోనే యూజ‌ర్ల‌కు సరిపోయే ఉద్యోగాలను సెర్చ్ చేసుకునే సౌకర్యంతో పాటు, దరఖాస్తు చేసుకునే సదుపాయాన్ని తీసుకురానుంది. తొలిద‌శ‌లో ఈ ఫీచ‌ర్‌ను అమెరికా, కెనడాలో తీసుకురానున్నారు. అనంత‌రం ప్రపంచవ్యాప్తంగా ఆ ఫీచ‌ర్‌ని అందుబాటులోకి తీసుకొస్తారు.

 

ఇప్ప‌టికే ఈ స‌దుపాయాన్ని లింక్డ్‌ఇన్ క‌ల్పిస్తోన్న విష‌యం తెలిసిందే. ఫేస్‌బుక్‌లో కూడా ఈ స‌దుపాయం రానుండ‌డంతో ఇక లింక్డ్‌ఇన్ దాని నుంచి గ‌ట్టి పోటీ ఎదురుకోనుంది. ఫేస్‌బుక్ తీసుకొస్తోన్న ఈ ఫీచర్ లో ఉద్యోగాలందించే సంస్థలు ఇకపై నేరుగా ఫేస్‌బుక్‌లో తమకంటూ ఓ పేజీని క్రియేట్‌ చేసుకొని తమ వద్ద ఏయే ఉద్యోగావ‌కాశాలు ఉన్నాయో పేర్కొన‌వ‌చ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: