'వాడేసుకోండ్రా... వాడేసుకున్నోడికి వాడుకున్నంత' అంటూ ప్రముఖ సినీ నటుడు బ్రహ్మానందం ఒక సినిమాలో చెబుతాడు. దీనిని స్పూర్తిగా తీసుకున్నారో లేక సాంకేతిక సౌకర్యాన్ని సమర్ధవంతంగా వినియోగించుకుంటున్నారో కానీ... వాట్స్ యాప్ ను భారతీయులు అద్భుతంగా వాడేసుకుంటున్నారని తెలిపింది.


గత ఏడాది వరకు ప్రముఖ మెసేజింగ్ యాప్ గా ఉన్న వాట్స్ యాప్... కాలింగ్ సౌకర్యాన్ని తీసుకొచ్చింది. ఈ సౌకర్యం తీసుకొచ్చి సుమారు ఆరు నెలల సమయం గడిచింది. ఈ ఆరునెలల్లో వాట్స్ యాప్ కాలింగ్ సౌకర్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా కల్పించగా, భారత్ మాత్రం సమర్ధవంతంగా వాడుకుందని వాట్స్ యాప్ తెలిపింది.

 

రోజుకు కోట్ల వీడియో కాలింగ్ నిమిషాలు వాడుకుంటూ భారత్ వాట్స్ యాప్ ను వినియోగిస్తున్న దేశంగా అగ్రభాగాన నిలిచిందని తెలిపింది. వాట్స్ యాప్ కు ప్రపంచవ్యాప్తంగా 100.20 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు ఉండగా...అందులో కేవలం భారత్ నుంచే 20 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారని వాట్స్ యాప్ వెల్లడించింది.


ప్రపంచ వ్యాప్తంగా 34 కోట్ల వీడియో కాలింగ్ నిమిషాలు నమోదవుతుండగా... అందులో భారత్ నుంచే 5 కోట్ల వీడియో కాలింగ్ నిమిషాలు నమోదవుతున్నాయని వెల్లడించింది. ఇది అనూహ్య విజయమని, ఈ విజయ సాధనకు భారతీయులే కారణమని వాట్స్ యాప్ వెల్లడించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: