ఉత్తరకొరియాకు చెందిన లాజరస్ గ్రూప్ ప్రపంచంపై విరుచుకుపడి వాన్నా క్రై మాల్ వేర్ ను వ్యాప్తి చేయడం ద్వారా హ్యాకింగ్ కు పాల్పడిన సంగతి తెలిసిందే. దీని ధాటికి వివిధ దేశాల్లోని వివిధ శాఖలు పని చేయకుండా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. వివిధ రంగాల్లో సేవలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఒక యువకుడు దీనికి విరుగుడు కనుగొని ప్రపంచానికి ఉపశమనం అందించగా, ఇప్పటికే దీని బారినపడి...తీవ్రంగా నష్టపోయిన విభాగాలున్నాయి. భారత్ పై ఈ సైబర్ దాడి పెద్దగా ప్రభావం చూపనప్పటికీ.. భారత్ పై 48,000 సార్లు వాన్నా క్రై సైబర్ దాడికి యత్నాలు చేసిందని క్విక్‌ హీల్‌ టెక్నాలజీ సంస్థ వెల్లడించింది. ఈ దాడుల్లో ఎక్కువ భాగం పశ్చిమబెంగాల్‌ లోని కంప్యూటర్లపై జరిగాయని, అయితే హ్యాకర్లు ఊహించిన స్థాయిలో భారత్ లోని విభాగాలను హ్యాకింగ్ చేయలేకపోయారని ఆ సంస్థ సారథి సంజయ్‌ కట్కర్‌ తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: