ప్రపంచంలో మొబైల్ యూజర్స్ శాతం బాగా పెరిగిపోయింది.  ఇందు కోసం కొత్త కొత్త ఫీచర్స్ తో మొబైల్ సంస్థలు పోటీలు పడి మరీ విడుదల చేస్తున్నాయి.  ఇక స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత ప్రపంచాన్ని మన గుప్పిట్లో పెట్టుకున్నట్లవుతుంది. అంతే కాదు ఫోటోలు, వీడియోలు,చాటింగ్స్ ఇలా ఎన్నో రకాల సౌకర్యాలు స్మార్ట్ ఫోన్లో ఉంటున్నాయి.  అయితే ఎంత గొప్ప మొబైల్ ఫోన్ అయినా కింద పడితే పగిలిపోతుంది..నీటిలో పడితే తడిసి పోతుంది.  

ఇప్పుడు వీటన్నిటికి చెక్ పెడుతూ..యూల్‌ఫోన్ సంస్థ ఆర్మ‌ర్ 2 పేరిట ఓ నూత‌న ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను విడుద‌ల చేసింది. రూ.17,300 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ఈ నెల 15వ తేదీ నుంచి ల‌భ్యం కానుంది. కాగా ఈ ఫోన్‌ను చాలా దృఢ‌మైన మెటీరియ‌ల్‌తో త‌యారు చేశారు.  ఈ ఫోన్ ఎన్నో అద్భుతమైన సౌకర్యాలు ఉన్నాయి.  

నీటిలో ప‌డితే..ఒక్క చుక్క నీరు కూడా లోపలికి వెళ్లదు..40 డిగ్రీల నుంచి 80 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్ర‌త‌లలోనూ ఈ ఫోన్‌ను నిర‌భ్యంత‌రంగా ఉప‌యోగించుకోవ‌చ్చు. గ్లాస్ ఫైబ‌ర్, రీయిన్‌ఫోర్స్‌డ్ పాలీకార్బొనేట్‌, మెటల్‌తో ఈ ఫోన్‌ను త‌యారు చేయ‌డం వ‌ల్ల చాలా దృఢంగా, సుర‌క్షితంగా ఉంటుంది. ఇక ఈ ఫోన్‌లో ఏర్పాటు చేసిన ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌తో ఫోన్‌ను కేవ‌లం 0.1 సెకండ్ల టైంలోనే అన్‌లాక్ చేసుకోవ‌చ్చు. డార్క్ గ్రే, గోల్డ్ రంగుల్లో ఈ ఫోన్ ల‌భిస్తున్న‌ది. 


యూల్‌ఫోన్ ఆర్మ‌ర్ 2 ఫీచ‌ర్లు :
5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే
 గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్ష‌న్‌
1920 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌
2.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌
6 జీబీ ర్యామ్‌
64 జీబీ స్టోరేజ్‌
256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌
ఆండ్రాయిడ్ 7.0 నూగట్‌
డ్యుయ‌ల్ సిమ్‌
16 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా
8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా
ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌
బారోమీట‌ర్‌
4జీ ఎల్‌టీఈ
 బ్లూటూత్ 4.1
 యూఎస్‌బీ టైప్ సి
 ఎన్ఎఫ్‌సీ
 4700 ఎంఏహెచ్ బ్యాట‌రీ
 ఫాస్ట్ చార్జింగ్‌.


మరింత సమాచారం తెలుసుకోండి: