ప్రపంచం ఇప్పడు టెక్నాలజీ పరంగా ముందుకు దూసుకు వెళ్తుంది.  ఎన్నో అద్భుతమైన వస్తువులు ఆవిష్కరణలు జరుగుతున్నాయి.  ముఖ్యంగా కమ్యూనికేషన్ రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు చేర్పులు తీసకువచ్చారు.  ఒక్క స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ఇప్పుడు ప్రపంచం మన గుప్పిట్లో ఉన్నట్లే లెక్క.  అయితే ఏ ఫోన్ నడవాలన్నా..దానికి చార్జింగ్ అవసరం.

ఇందుకోసం చార్జర్లు, పవర్ బ్యాంక్ లాంటివి మార్కెట్ లో ఉన్నాయి.  ఇప్పుడు ప్రపంచంలోనే తొలిసారిగా వైర్‌లెస్ చార్జర్‌ మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చింది. అమెరికాలోని సిలికాన్ వ్యాలీకి చెందిన సంస్థ వైర్‌లెస్ చార్జర్‌ను ప్రవేశపెట్టింది.  దీనితో మొబైల్స్‌, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లకు చార్జింగ్ పెట్టుకొవచ్చని సంస్థ ప్రకటించింది.  

ఈ చార్జర్ చిన్న టేబుల్‌ సైజ్ ఉంటుందని అయస్కాంత తరంగాల ద్వారా పని చేస్తుందని సంస్థ తెలిపింది. పై వైర్‌లెస్ చార్జింగ్ రూపొందించడానికి సంవత్సరం పట్టిందని పై చీఫ్‌ టెక్నాలజీ అధికారి లక్షిన్‌ షీ, జాన్‌ మెక్‌డొనాల్డ్‌ ప్రకటించారు. స్మార్ట్‌ఫోన్‌కు చార్జింగ్ పెట్టినప్పుడు వైర్‌లెస్ చార్జర్‌కు అయస్కాంత తరంగాలు ఉత్పత్తి అవుతాయని  చీఫ్‌ టెక్నాలజీ అధికారి అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: