గత సంవత్సరం నుంచి సెల్ ఫోన్ రగంలో పెను మార్పులు తీసుకు వస్తుంది జియో నెట్ వర్క్. ఇప్పటికే దేశంలో ఉన్న అన్ని నెట్ వర్క్ సంస్థలకు చెమటలు పట్టిస్తున్న జియో మరో కొత్త ఆఫర్ తో వినియోగదారుల ముందుకు వచ్చింది.  జియో త‌మ ప్రీపెయిడ్ వినియోగ‌దారుల కోసం ఓ కొత్త ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది.
Image result for ప్రీపెయిడ్ వినియోగ‌దారుల‌కు జియో కొత్త ఆఫ‌ర్‌
ఇక నుంచి రూ. 96, రూ. 149తో రీఛార్జీ చేసుకున్న వారికి కూడా అన్‌లిమిటెడ్ డేటా సౌక‌ర్యాన్ని అందించ‌నున్న‌ట్లు జియో త‌న వెబ్‌సైట్‌లో పేర్కొంది. ప్ర‌స్తుతం రూ. 309, అంత‌క‌న్నా ఎక్కువ రీఛార్జీ చేసుకున్న వినియోగ‌దారుల‌కు మాత్ర‌మే రిల‌య‌న్స్ జియో అప‌రిమిత డేటా స‌దుపాయాన్ని క‌ల్పిస్తోంది. ప్రీపెయిడ్‌ వినియోగ‌దారుల‌ను మ‌రింత‌గా ఆక‌ట్టుకోవ‌డం కోసం ఈ అప‌రిమిత డేటా ఆఫ‌ర్ సౌక‌ర్యాన్ని మ‌రో రెండు ప‌థ‌కాల‌కు కూడా జియో పొడిగించింది.   
Image result for ప్రీపెయిడ్ వినియోగ‌దారుల‌కు జియో కొత్త ఆఫ‌ర్‌
రూ. 96తో రీఛార్జీ చేసుకుంటే 7 రోజుల పాటు అప‌రిమిత కాల్స్‌తో పాటు రోజుకు 1 జీబీ 4జీ డేటా వాడుకోవ‌చ్చు. కానీ 1 జీబీ ప‌రిమితి త‌ర్వాత డేటా స్పీడ్ 128 కేబీపీఎస్‌కి ప‌డిపోతుంది. అలాగే రూ. 149తో రీఛార్జీ చేసుకుంటే 28 రోజుల పాటు అపరిమిత కాల్స్‌తో పాటు 300 ఎస్‌ఎంఎస్‌లు, 2జీబీ వరకు 4జీ వేగంతో డేటా లభిస్తుంది. 2 జీబీ వినియోగం త‌ర్వాత‌ 64 కేబీపీఎస్‌ వేగంతో డేటాను అపరిమితంగా వాడుకోవచ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి: