భారత దేశంలో గత సంవత్సరం నుంచి టెలికాం రంగంలో సంచలనాలు సృష్టించిన రిలయన్స్ జియో  ఇతర నెట్ వర్క్ సంస్థలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. దీంతో ఎయిర్ టేల్, ఐడియా, వొడా చివరికి బీఎస్ఎన్ఎల్ కూడా తమ తక్కువ టారిఫ్, ఫ్రీ వాయిస్ కాల్స్ ఇవ్వడానికి సిద్దపడ్డాయి.  అయితే జియో మార్కెట్ లోకి వచ్చిన తరువాత వినియోగదారులను ఆకట్టుకోవడానికి  తక్కువ టారిఫ్, ఫ్రీ వాయిస్ కాల్స్ మొదలగు ఆఫర్లను  ప్రకటించిన విషయం తెలిసిన విషయమే. 

కాకపోతే మార్కెట్ లోకి తన నెట్ వర్క్ పూర్తి స్థాయిలో పెంచుకున్న తర్వాత వినియోగదారులకు చిన్నగా షాక్ ఇవ్వడం ప్రారంభించింది. ఇటీవలే 15 నుంచి 20 శాతం టారిఫ్ లను పెంచిన జియో మరోసారి టారిఫ్ లను పెంచేందుకు సిద్దమవుతోంది. 

జనవరిలో జియో మరోసారి టారిఫ్ లను పెంచనుందని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ గోల్డ్ మన్ శాచ్ తన నివేదికలో పేర్కొంది.రూ. 309 ల ప్యాకేజి గడువును 49 రోజుల నుంచి 28 రోజులకు కుదించే అవకాశం ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: