ఈ మద్య సోషల్ మీడియాలో వచ్చినప్పటి నుంచి ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ వాడకం పెరిగిపోయినప్పటి నుంచి ప్రతి ఒక్కరి చేతిలో ప్రపంచంలో జరిగే విషయాలన్నీ ఇట్టే తెలిసి పోతున్నాయి.  ఒకప్పుడు ఫ్రెండ్ తో మాట్లాడంటే కేవలం ఆడియో ద్వారానే సాద్యమయ్యేది..కానీ లేటెస్ట్ టెక్నాలజీతో వీడియో వ్యూజువల్స్ తో ఇరువురు మాట్లాడుకునే సౌలభ్యం ఏర్పడింది. ముఖ్యంగా వాట్సప్ వచ్చినప్పటి నుంచి ఈ సౌకర్యం విపరీతంగా పెరిగిపోయింది. అందుకే చాలా మంది మొబైల్ యూజర్స్ వాట్సప్ ని తప్పకుండా వాడుతున్నారు. 
Image result for వాట్సాప్ ఫీచర్లు
సోషల్‌ మీడియా యాప్‌లో ఎక్కువగా ప్రాచుర్యం సంపాదించుకున్న వాట్సాప్‌, కొత్త కొత్త ఫీచర్లతో అలరిస్తోంది. తాజాగా వాట్సాప్‌ గ్రూప్‌ వాయిస్‌, వీడియో కాలింగ్‌ ఫీచర్‌ను కూడా యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తోంది.  అయితే ఈ ఫీచర్ ప్రస్తుతం ఐఫోన్‌ యాప్‌ లేటెస్ట్‌ బీటా వెర్షన్‌లో  మాత్రమే ఉంది.  ఇప్పటికే వాట్సాప్‌ ఈ ఏడాదిలో పలు ఫీచర్లను ప్రవేశపెట్టి, 1 బిలియన్‌కు పైగా యూజర్లను తన సొంతం చేసుకుంది. గ్రూప్‌ వాయిస్‌ కాల్స్‌ గురించి చాలా సంకేతాలున్నప్పటికీ, గ్రూప్‌ వీడియో కాల్స్‌కు సంబంధించి ఒకే ఒక సంకేతం ఉన్నట్టు పేర్కొంది.
Image result for వాట్సాప్ ఫీచర్లు
గ్రూప్‌ వాయిస్‌ కాల్స్‌కు ఫీచర్‌పై ఈ యాప్‌ ప్రస్తుతం పనిచేస్తుందని, వచ్చే ఏడాది దీన్ని విడుదల చేయనున్నట్టు అంతకముందే పలు రిపోర్టులు నివేదించాయి. గ్రూప్ వీడియో కాలింగ్ గురించి కొద్దిగా సందిగ్ధ‌త ఉన్నా… గ్రూప్ వాయిస్ కాలింగ్ స‌దుపాయాన్ని మాత్రం వాట్సాప్ త్వ‌ర‌లో త‌ప్ప‌కుండా క‌ల్పించ‌నుంద‌ని తెలుస్తోంది. అయితే ఈ ఫీచ‌ర్లు ఎప్పుడు అందుబాటులోకి వ‌స్తాయనే విష‌యం ఇంకా తెలియాల్సి ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: