వాట్సప్ యూజర్స్ కి గుడ్ న్యూస్ లేటెస్ట్ గా వాట్సప్ ప్రవేశపెట్టిన ఆప్షన్ ఇప్పుడు ఎంతో మందికి ఉపయోగపడేలా ఉంది..కానీ ఆ ఆప్షన్ ఓన్లీ “యునైటెడ్ అరబ్ ఎమిరేట్స” లో ఉండేవాళ్ళకి మాత్రమే అని చెప్తోంది కంపెనీ.ఆ ఆప్షన్ విశేషాలు ఏమిటింటే..మీరు పొరపాటున ఒకరికి పంపే సందేశం వేరొకరికి పంపినా లేక..మీరు పంపే సందేశం వాళ్ళ ఎటువంటి ఇబ్బందులు తలెత్తుతాయో అని ఆలోచించినా..మీరు దానిని తీసివేయాలి అని అనుకుంటే వెంటనే తీసివేయచ్చు.


పాపులర్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. పంపించిన సందేశం అసభ్యకరమైనదని గుర్తిస్తే వెంటనే డిలీట్ చేసుకునే అవకాశం యూఏఈ వాట్సాప్ వినియోగదారులకు దక్కింది. సందేశాన్ని పంపించిన 7నిమిషాలలో సందేశాన్ని ఇకపై డిలీట్ చేయవచ్చు. మెసేజ్‌ను పంపించి 7నిమిషాలు దాటితే చేసేదేమీ ఉండదు. ఈ సరికొత్త ఫీచర్ యూఏఈ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది.


యాప్‌ను అప్‌డేట్ చేస్తే ఈ సరికొత్త ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు. పంపించిన మెసేజ్‌పై టాప్ అండ్ హోల్డ్ చెయ్యాలి. తర్వాత డిలీట్ ఫర్ ఎవ్రీవన్ అనే ఆప్షన్‌ టాప్ చేస్తే పని పూర్తైనట్లే. కాబట్టి యూఏఈలోని వాట్సాప్ యూజర్లు ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ ఆప్షన్ మీద స్పందన చుసిన తరువాత దీనిని ప్రపంచవ్యాప్తంగా అమలు చేయనున్నారు అని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: