అమెరికాలో సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం, ఈట్ స్ట్రీట్, డెలివరీ.కామ్, డోర్ డాష్, చౌనౌ మరియు ఓలో ఫుడ్ ఆర్డరింగ్ సర్వీస్ను అందిస్తున్నాయి. అదేవిధంగా జాక్ ఇన్ ది బాక్స్, ఫైవ్ గైస్, పాపా జాన్స్ , పనేరా వంటి రెస్టారెంట్లు కూడా ఈ ఫీచర్‌ను వాడుకుంటున్నాయి. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఫేస్ బుక్ ఖాతాలు లేని వారు ఉన్నారంటే అస్సలు నమ్మలేం. 

స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికీ వాట్సప్, ఫేస్ బుక్ లు తప్పకుండా వాడుతున్నారు.  వరల్డ్ వైడ్ గా కోట్లాది మంది యూజర్లను సొంతం చేసుకున్న సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ మరో సరికొత్త ఫీచర్‌తో ముందుకు వచ్చింది. ఫేస్‌బుక్ యాప్, వెబ్ సైట్ నుంచి యూజర్లు తమకు నచ్చిన ఫుడ్ ను ఆర్డర్ చేసే అవకాశం కల్పించింది. ఈ సేవలు ఇప్పటికే అమెరికాలో అందుబాటులోకి వచ్చాయి.

 తాజాగా ఈ సరికొత్త ఫీచర్ కోసం ఫేస్‌బుక్ డెలివరీ.కామ్ వంటి ఫుడ్ ఆర్డరింగ్ కంపెనీలతో ఒప్పందం చేసుకుంది.  అమెరికాలో ఫేస్‌బుక్ ప్రస్తుతం ఐఓఎస్, ఆండ్రాయిడ్ మరియు డెస్క్ టాప్ తోపాటు ప్రతిచోటా ఫుడ్ ఆర్డరింగ్ ఫీచర్లను రోలింగ్ చేస్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: