ఇప్పుడు చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే ప్రపంచం మన గుప్పిట్లో ఉన్నట్లే లెక్క.  గత కొంత కాలంగా ఇంటర్ నెట్ సేవలు అతి తక్కువ ధరలకే వివిధ టెలికం సంస్థలు అందిస్తున్న విషయం తెలిసిందే.  సోషల్ మాద్యమాలైన ఫేస్ బుక్, వాట్సాప్ లు ప్రపంచ ప్రాచుర్యం పొందిన విషయం తెలిసిందే.  స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సాప్ యూజ్ చేసేవాళ్లు ఎక్కువ మంది ఉన్నారు.  ఈ మద్య వాట్సాప్ లో కొత్త ఫీచర్లు తీసుకు వస్తున్న విషయం తెలిసిందే.  అయితే ప్రపంచ ప్రాచుర్య మెసేజింగ్ స‌ర్వీస్ యాప్ వాట్సాప్, భార‌త్‌ స‌హా ప‌లు దేశాల్లో మొరాయించింది. 

ఈ మద్య వాట్సాప్ ప‌నిచేయడం లేద‌ని దేశంలో చాలా మంది వినియోగదారులు ఫిర్యాదు చేస్తున్నారు. అలాగే ఇట‌లీ, సౌదీ అరేబియా, ఫిలిప్పీన్స్‌, జ‌ర్మ‌నీ, అమెరికా, శ్రీలంక దేశాల్లో కూడా వాట్సాప్ మొరాయించిన‌ట్లు తెలుస్తోంది. వాట్సాప్ ద్వారా మెసేజ్ పంప‌డం గానీ, రిసీవ్ చేసుకోవ‌డం గానీ కుద‌ర‌డం లేద‌ని వినియోగ‌దారులు త‌మ సోష‌ల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేస్తున్నారు.

అంతేకాకుండా స్టేట‌స్ అప్‌డేట్ కూడా ప‌నిచేయ‌డం లేద‌ని చెబుతున్నారు.అయితే ఈ స‌మ‌స్య‌కు కార‌ణం ఏంటో తెలియ‌రాలేదు. ఎక్కువ మంది వినియోగదారులు ఉండ‌టం వ‌ల్ల అప్పుడ‌ప్పుడు ఇలా స‌ర్వ‌ర్ స‌మ‌స్య‌లు రావొచ్చ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: