భారత దేశంలో జియో చేస్తున్న మ్యాజిక్ కి ఇతర నెట్ వర్క్ సంస్థలు తలలు పట్టుకుంటున్నాయి.  అయితే జియోకి పోటీగా గత కొంత కాలంగా ఐడియా, ఎయిర్ టేల్, వొడ కొత్త కొత్త ఫీచర్స్, ఆఫర్లు వినియోగదారులకు అందుబాటులోకి తీసుకు వస్తున్నారు. తాజాగా వొడాఫోన్‌, ఐటెల్‌ భాగస్వామ్యంలో కొత్తగా ఓ 4జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఏ20 పేరుతో  ఎంట్రీ లెవల్‌ సెగ్మెంట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. రూ.3,690 డౌన్‌పేమెంట్‌లో అందుబాటులో ఉండే ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.2100 క్యాష్‌బ్యాక్‌ను వొడాఫోన్‌ ఆఫర్‌చేస్తోంది. 

అచ్చం జియో ఫోన్  ఆఫర్ మాదిరిగానే వొడా ఫోన్ నెట్ వర్క్ ప్రణాళిక సిద్దం చేసింది.    క్యాష్‌బ్యాక్‌ను పొందడానికి ఏ20 స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుదారులు వరుసగా 18 నెలల పాటు రూ.150 లేదా ఆపై మొత్తాలతో రీఛార్జ్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇలా రీఛార్జ్‌లు చేయించుకుంటే, ఏడాదిన్నర తర్వాత రూ.900, ఆ తర్వాత ఏడాదిన్నరకు రూ.1200ను క్యాష్‌బ్యాక్‌గా అందిస్తుంది. యూజర్లు ఈ క్యాష్‌బ్యాక్‌ మొత్తాన్ని ఎం-పైసా వాలెట్లలో పొందుతారని వొడాఫోన్‌ పేర్కొంది. 


ఇక వొడాఫోన్‌-ఇంటెల్‌ ఏ20 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు :
4జీ వాయిస్‌ఓవర్‌ ఎల్‌టీఈ
ఆండ్రాయిడ్‌ 7.0 నోగట్‌
1జీబీ ర్యామ్‌, 8జీబీ ఇంటర్నల్‌ మెమరీ
1.3గిగాహెడ్జ్‌ క్వాడ్‌-కోర్‌ ప్రాసెసర్‌
1500 ఎంఏహెచ్‌ బ్యాటరీ


మరింత సమాచారం తెలుసుకోండి: