బ్లాక్‌బెర్రీ ఓఎస్‌, బ్లాక్‌బెర్రీ 10, విండోస్ ఫోన్ 8.0, దానికి ముందు వెర్ష‌న్ల‌లో త‌మ సేవ‌ల‌ను డిసెంబ‌ర్ 31, 2017 నుంచి నిలిపివేయ‌నున్న‌ట్లు వాట్సాప్ ప్ర‌క‌టించింది.  వీటికి సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి అప్‌డేట్స్‌ అభివృద్ధి చేయడం లేదని,  కొన్ని ఫీచర్లు  ఏ సమయంలోనైనా పనిచేయకపోవడం ఆగిపోవచ్చునని వెల్లడించింది. భవిష్యత్తులో తమ యాప్‌ ఫీచర్లను ఇంకా అభివృద్ధి చేద్దామనుకుంటున్నామని, కానీ ఈ ఫ్లాట్‌ఫాంలకు అంత సామర్థ్యం లేదని చెప్పింది.

మొబైల్‌ ఫ్లాట్‌ఫాంలపై  డిసెంబర్‌ 31, 2017 తర్వాత మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌  నిలిచిపోనున్న ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.   కాకపోతే..ఈ ఓఎస్‌లు వాడుతున్న వారు వెంటనే కొత్త ఓఎస్‌ వెర్షన్‌(ఆండ్రాయిడ్‌ ఓఎస్‌ 4.0+, ఐఫోన్‌ ఓఎస్‌ 7+, విండోస్‌ ఫోన్‌ 8.1+)లోకి అప్‌గ్రేడ్‌ కావాలని సూచించారు. అప్పుడే మీరు వాట్సప్‌ను వినియోగించుకునేందుకు వెసులుబాటు కలుగుతుందని తెలిపారు.

అలాగే డిసెంబ‌ర్ 31, 2018 నుంచి నోకియా ఎస్‌40 ఫోన్ల‌లో, ఫిబ్ర‌వరి 1, 2020 నుంచి ఆండ్రాయిడ్ వెర్ష‌న్ 2.3.7, దానికి ముందు ఆండ్రాయిడ్ వెర్ష‌న్ ఫోన్ల‌లో వాట్సాప్ సేవ‌లు ప‌నిచేయ‌బోవ‌ని తెలిపింది. ఆయా ఆప‌రేటింగ్ సిస్టంలు వాడుతున్న వారంద‌రూ అప్‌డేట్ చేసుకోవ‌డం ద్వారాగానీ, వేరే ఆప‌రేటింగ్ సిస్టం ఉప‌యోగించ‌డం ద్వారా గానీ సేవ‌ల‌ను పునరుద్ధ‌రించుకోవాల‌ని కోరింది.


మరింత సమాచారం తెలుసుకోండి: