వాట్సప్ మెసేజ్ ప్రస్తుతం కామన్ అయ్యింది. ఎస్ ఎంఎస్ లు, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్‌తో పాటు ఫొటోలు, వీడియోలు షేరింగ్‌కు కూడా వాట్సాప్‌ ఎంతగానో ఉపయోగపడుతోంది. మనం పంపించిన మెసేజ్‌లు అవతలివాళ్లు చూశారో.. లేదో అనే విషయాన్నికూడా తెలుసుకునే సదుపాయం ఉండడంతో ఇంటర్‌నెట్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ యాప్‌నే ఉపయోగిస్తున్నారు. 

వాట్సాప్ యాజమాన్యం తమ వినియోగ దారులను ఆకర్షించేందుకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. అయితే కొత్త ఫీచర్‌ను వినియోగదారులకు అందించే ప్రయత్నంలో వాట్సాప్‌లో ఓ పొరపాటు జరిగింది. వాట్సాప్ డెవలపర్లు టెస్టింగ్ దశలో ఉన్న ఓ కొత్త ఫీచర్‌ను పొరపాటున యాక్టివేట్ చేశారు. అదే 'రిప్లై ఇన్ ప్రైవేట్' అనే ఫీచర్. 

కొత్త ఫీచర్‌లో ఒక గ్రూపులో ఓ వ్యక్తి.. తన గ్రూపులోని ఇతర సభ్యులకు తెలియకుండా అదే గ్రూపులోని మరో వ్యక్తికి వ్యక్తిగత మెసేజ్ పంపవచ్చు. పొరపాటును గుర్తించిన వాట్సాప్ యాజమాన్యం వెంటనే విండోస్ ఫోన్ 2.17.344 వాట్సాప్ బీటా వెర్షన్‌లో పనిచేసే ‘ప్రైవేట్ ఇన్ రిప్లై’ ఫీచర్‌ను 2.17.342ను   తొలగించినట్టు వాట్సాప్ బీటాఇన్ఫో పేర్కొంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: