చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు వివో తన నూతన స్మార్ట్‌ఫోన్ 'వివో ఎక్స్20 ప్లస్ యూడీ'ని త్వరలో విడుదల చేయనుంది. రూ.36,770 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుంది. ఇందులో డిస్‌ప్లే కిందే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. ఇప్ప‌టివ‌రకు వ‌చ్చిన స్మార్ట్‌ఫోన్ల‌లో ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్ వెన‌క‌వైపున గానీ, హోం బ‌ట‌న్ వ‌ద్ద గానీ ఉండేది.

వివో ఎక్స్ 20 ప్ల‌స్ యూడీ పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకురానుంది. దీని ధ‌ర రూ. 36,770గా ఉండ‌నున్న‌ట్లు కంపెనీ వెల్ల‌డించింది. ఇక ఇందులో 18:9 యాస్పెక్ట్ రేషియో ఉన్న 6.43 ఇంచ్ భారీ ఫుల్ వ్యూ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీంతోపాటు పలు ఇతర ఆకట్టుకునే ఫీచర్లను కూడా ఈ ఫోన్‌లో అందిస్తున్నారు. 


వివో ఎక్స్20 ప్లస్ యూడీ ఫీచర్లు...
6.43 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 12 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 3905 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.



మరింత సమాచారం తెలుసుకోండి: