ఈ రోజు 2018-19 కేంద్రబడ్జెట్ ఆర్థిక శాఖా మంత్రి అరుణ్ జెట్లీ ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే.  మరో నెల వ్యవధిలోనే మరోసారి మొబైల్‌ ఫోన్లకు కేంద్రం షాకిచ్చింది. ఈ ప్రభావం ఎక్కువగా ఆపిల్‌ వంటి కంపెనీలపై ప్రభావం చూపనున్నట్టు టెక్‌ వర్గాలు చెప్పాయి. చైనా ఫోన్లపై మరింత ప్రభావం ఉంటుందన్నారు.

బడ్జెట్‌లో మొబైల్‌ ఫోన్లపై కస్టమ్స్‌ డ్యూటీని 15 శాతం నుంచి 20 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించారు. స్థానిక తయారీని ప్రోత్సహించడానికి అరుణ్‌జైట్లీ ఈ ప్రకటన చేశారు. గత నెలలోనే మొబైల్‌ ఫోన్లపై కస్టమ్‌ డ్యూటీతో పాటు టీవీలు, మైక్రోవేల్‌ అవెన్లపై కూడా కస్టమ్స్‌ డ్యూటీని కేంద్రం 20 శాతానికి పెంచింది. తద్వారా విదేశీ దిగుమతులు తగ్గి దేశీయ కంపెనీలకు ప్రోత్సాహం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఆరెంజ్‌ జ్యూస్‌లు కూడా కూరగాయలు, పండ్ల జ్యూసుల ధరలు కూడా 50 శాతం పెరుగనున్నాయి. గోల్డ్‌ , సిల్వర్‌పై సాంఘిక సంక్షేమ సర్‌ఛార్జీని విధించారు. స్మార్ట్‌వాచస్‌,  ఫుట్‌వేర్‌ భాగాలపై కూడా కస్టమ్స్‌ డ్యూటీని పెంచారు.కస్టమ్స్‌ డ్యూటీ పెంపుతో ఫోన్లను భారత్‌లో తయారుచేసే విధానాన్ని ప్రోత్సహించాలని ప్రభుత్వం చూస్తున్నట్టు పరోక్ష పన్నుల కన్సల్టెన్సీ ఈవై హెడ్‌ బిపిన్‌ సప్రా తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: