ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు వాడుతున్న ఇన్‌స్టంట్ మెసెంజర్ యాప్‌ వాట్సప్. ఎన్నో ఇన్‌స్టంట్ మెసెంజర్ యాప్‌లు అందుబాటులోకి వచ్చినా.. వాట్సప్ ఆకట్టుకున్నంతగా ఆకర్షించలేకపోయాయి.  ఇప్పటి జనరేషన్ కి ఎప్పటికప్పుడు కొత్త కొత్త టెక్నాలజీ వాడుతున్నారు. ఇతర యాప్‌లతో పోలిస్తే ఫీచర్లు కొంత తక్కువే అయినా, ఉన్నంతలో క్వాలిటీ ఫీచర్స్‌ను అందించే ఇన్‌స్టంట్ మెసెంజర్ యాప్‌గా వాట్సప్ పేరుగాంచింది.
Image result for whatsapp payment
వాట్సాప్‌కు చెందిన బీటా వెర్ష‌న్ యాప్‌ను ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ ప్లాట్‌ఫాంల‌పై వాడే యూజ‌ర్ల‌కు ఈ ఫీచ‌ర్ అందుబాటులోకి వ‌చ్చింది. ఈ క్రమంలోనే స‌ద‌రు యూజ‌ర్లు చాట్‌ విండోలోనే ఈ ఫీచర్‌ను యాక్సస్‌ చేసుకోవచ్చు. గ్యాలరీ, వీడియో, డాక్యుమెంట్లు వంటి ఇతర ఆప్షన్లతో పాటు ఈ ఆప్షన్‌ కూడా ఇక అందుబాటులో ఉంటుంది.
Image result for whatsapp payment
పేమెంట్స్‌ను క్లిక్‌ చేస్తే.. ఓ డిస్‌క్లెయిమర్ విండో ఓపెన్‌ అవుతుంది. దీంట్లో బ్యాంకుల జాబితా కూడా ఉంటుంది.ఇక లావాదేవీని విజయవంతంగా పూర్తిచేసుకోవాలంటే నగదు పంపేవారికి, స్వీకరించే వారికి ఇద్దరికీ కచ్చితంగా వాట్సాప్‌ ఆఫర్‌ చేసే పేమెంట్స్‌ ఫీచర్‌ ఉండాలి. వాట్సాప్ అందుబాటులోకి తీసుకువ‌చ్చిన ఈ పేమెంట్స్ ఫీచ‌ర్ ఐఓఎస్‌లోని 2.18.21 వాట్సాప్ బీటా వెర్షన్‌కు, ఆండ్రాయిడ్‌ 2.18.41 బీటా వెర్షన్‌ వారికి అందుబాటులో ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: