ప్రపంచం టెక్నాలజీ రంగంలో దూసుకెళ్తుంది. ఎన్నో కొత్త కొత్త వస్తువులు కనిపెడుతున్నారు.  ముఖ్యంగా కమ్యూనికేషన్ పరంగా ప్రతిరోజు టెక్నాలజీ అప్ డేట్ అవుతూనే ఉంది. ఒకప్పుడు ఫోన్ మట్లాడాలంటే ఎన్నో ఇబ్బందులు పడేవారు..కానీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ల పుణ్యమా అని ఎక్కడో ఉన్న వ్యక్తులను కూడా లైవ్ లో చూస్తూ మాట్లాడుకునే సౌలభ్యం కలిగింది. ఇప్పటి వరకు స్మార్ట్ ఫోన్లలో 2జి, 3జి అంటే ఎంతో గొప్పగా చెప్పుకునే వారు. కానీ   2జి శకం ముగిసింది... 3జీ కూడా ముగిసిపోయి కాలం 4జీ వైపు పరుగులు పెడుతోంది.

అయితే త్వరలో 4జీ శకం కూడా ముగిసిపోయి 5జీ వైపు అడుగులు వేగంగా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.  క్వాల్‌కామ్‌, ఇంటెల్‌ రెండూ కూడా కొన్ని నెలల నుంచి దీనిపై ట్రయల్స్‌ నిర్వహిస్తున్నాయని, 2018 చివరి వరకు లేదా 2019 ప్రారంభంలో 5జీ కేపబుల్‌ తొలి స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లోకి రానున్నట్టు రిపోర్టులు పేర్కొన్నాయి. 

2019లో స్నాప్‌డ్రాగన్‌ ఎక్స్‌50 5జీ మోడమ్స్‌తో స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసేందుకు 18 ఫోన్‌ తయారీదారి కంపెనీలతో కలిసి పనిచేస్తున్నట్టు క్వాల్‌కామ్‌ ప్రకటించింది.5జీ స్మార్ట్‌ఫోన్లను అందించే కంపెనీ జాబితాలో ఆపిల్‌, శాంసంగ్‌, హువావే లేకపోవడం గమనార్హం. ఆపిల్‌కు గత ఏడాదిగా క్వాల్‌కామ్‌తో న్యాయ వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో క్వాల్‌కామ్‌తో కలిసి ఆపిల్ పనిచేయడం లేదని తెలుస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: