భారత దేశంలో కమ్యూనికేషన్ రంగంలో రిలయన్స్ జియో చేస్తున్న మాయాజాలం అంతా ఇంతా కాదు.  జియో దెబ్బకు వివిధ నెట్ వర్క్ సంస్థలు తమ టారీఫ్ లు అన్నీ మార్చుకుంటూ వస్తున్నాయి. అంతే కాదు ప్రతినెల ఏదో ఒక ఆఫర్ ప్రకటిస్తూ..వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఎయిర్ టేల్, ఐడియా, వొడా ఫోన్ ఇలా నెట్ వర్క్ సంస్థలు ఎన్నో ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.

ఇక రిపబ్లిక్ డే ఆఫర్‌లో భాగంగా రిలయన్స్ జియో తెరపైకి తెచ్చిన రూ.98 రీచార్జ్ ప్లాన్‌ను ఎదురొడ్డేందుకు భారతీ ఎయిర్‌టెల్ రెడీ అయింది. తన రూ.93 రీచార్జ్ ప్లాన్‌ను సవరించింది. ఇప్పటి వరకు ఈ ప్లాన్‌ కాలపరిమితి పది రోజులు కాగా, ఇకపై 28 రోజుల వ్యాలిడిటీతోపాటు ఇతర బెనిఫిట్స్ కూడా ఖాతాదారులకు అందుబాటులోఉంటాయి.

పరిమిత లోకల్/ఎస్టీడీ కాల్స్, ఉచిత రోమింగ్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, 28 రోజుల కాలపరిమితితో 1జీబీ 4జీ/3జీ డేటా లభిస్తుంది. అంతే కాదు 250 నిమిషాల వరకు అపరికిత కాల్స్ చేసుకోవొచ్చు.  . వారానికి 1000 నిమిషాలకు మించకూడదు. రోజువారీ కాల్స్ పరిమితి దాటిపోతే నిమిషానికి పది పైసలు చెల్లించాల్సి ఉంటుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: