గత కొంత కాలంగా సెల్ ఫోన్ రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి.  కొత్త కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లు మార్కెట్ లోకి వస్తున్నాయి. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు సోనీ తన నూతన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌పీరియా ఎక్స్‌జడ్2ను తాజాగా విడుదల చేసింది. బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ) 2018 ప్రదర్శనలో ఈ ఫోన్‌ను సోనీ ప్రదర్శించింది. లిక్విడ్ బ్లాక్, లిక్విడ్ సిల్వర్, డీప్ గ్రీన్, యాష్ పింక్ రంగుల్లో ఈ ఫోన్ యూజర్లకు త్వరలో లభ్యం కానుంది. దీని ధర వివరాలను సోనీ వెల్లడించలేదు.


సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌జడ్2 ఫీచర్లు : 5.7 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 400 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్
ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 19 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, యూఎస్‌బీ టైప్ సి, ఫింగర్‌ప్రింట్ సెన్సార్
4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, 3180 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0, వైర్‌లెస్ చార్జింగ్.


మరింత సమాచారం తెలుసుకోండి: