కొంత కాలంగా స్మార్ట్ ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగిపోవడంతో..వివిధ కంపెనీలు అతి తక్కువ ధరలకే ఎన్నో ఫీచర్స్ తో కొత్త స్మార్ట్ ఫోన్లు మార్కెట్ లోకి తీసుకు వస్తున్నారు.  దేశీయ స్మార్ట్ ఫోన్ కంపెనీ లావా ఆండ్రాయిడ్ గో వెర్షన్ పై తొలి స్మార్ట్ ఫోన్ జెడ్50 ని ఆవిష్కరించింది. ఆండ్రాయిగ్ గో అన్నది తక్కువ సామర్థ్యం కలిగిన స్మార్ట్ ఫోన్లలో పనితీరు వేగంగా ఉండేందుకు రూపొందించినది.
Image result for lava android z50 phone
లావా జెడ్50 ఫోన్ దేశవ్యాప్తంగా లక్ష అవుట్ లెట్లలో ఈ నెలలోనే అందుబాటులోకి రానుంది. ఎయిర్ టెల్ మేరా పెహలా స్మార్ట్ ఫోన్ కింద ఈ ఫోన్ ను కొనుగోలు చేసిన ఎయిర్ టెల్ కస్టమర్లు రూ.2,000 మేర క్యాష్ బ్యాక్ పొందే అవకాశం ఉంది.

లావా జెడ్50లో 4.5 ఎఫ్ డబ్ల్యూవీజీఏ స్క్రీన్, 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్, 1.1 గిగాహెర్జ్ క్వాడ్ కోర్ మీడియాటెక్ ఎంటీ6737 ప్రాసెసర్, 1జీబీ ర్యామ్, 8జీబీ స్టోరేజీ రామ్, మైక్రో ఎస్డీ కార్డు ద్వారా ఎక్స్ పాండబుల్, 10 ప్రాంతీయ భాషల అందుబాటు, ముందు, వెనుక 5 మెగా పిక్సల్స్ కెమెరా, ఫ్లాష్, బోకే మోడ్ ఇలా ఎన్నో ఫీచర్లు ఉన్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: