వాట్సాప్‌లో పొరపాటున ఏదైనా మెసేజ్‌ ఎవరికైనా పంపితే, ఏడు నిమిషాల వ్యవధిలో దాన్ని డిలీట్‌ చేసేవచ్చు. ఇలా మెసేజ్‌ను డిలీట్‌ చేసుకునే అవకాశాన్ని వాట్సాప్‌ కొన్ని నెలల క్రితం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్‌ యూజర్ల కోసం అభివృద్ధి చేసిన కొత్త బీటా 2.18.69 వెర్షన్‌లో ఈ వ్యవధిని పెంచింది. వాట్సాప్‌ గురించి ఎప్పడికప్పుడు అప్‌డేట్స్‌ అందించే డబ్ల్యూఏబీటాఇన్ఫో ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ యూజర్లకు తీసుకొచ్చిన ఈ ఫీచర్‌, ఐఓఎస్‌, విండోస్‌ ప్లాట్‌ఫామ్స్‌కు కూడా త్వరలోనే అందుబాటులోకి తేనుంది.
ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ యూజర్లకు
డిలీట్‌ మెసేజ్‌ ఫీచర్‌ సమయాన్ని పెంచడం మాత్రమే కాక, ఈ కొత్త అప్‌డేట్‌లో స్వల్ప మార్పులు కూడా చేసింది. ఈ బీటాలోనే లాక్డ్‌ రికార్డింగ్‌, స్టికర్‌ ప్యాక్‌ డిస్‌ప్లే సైజ్‌ వంటి ఫీచర్లను కూడా వాట్సాప్‌ తీసుకొచ్చింది.ఈ బీటాలోనే లాక్డ్‌ రికార్డింగ్‌, స్టికర్‌ ప్యాక్‌ డిస్‌ప్లే సైజ్‌ వంటి ఫీచర్లను కూడా వాట్సాప్‌ తీసుకొచ్చింది.  వాట్సప్‌లో ఫార్వార్డెడ్ మెసేజ్ పేరిట రానున్న ఈ ఫీచర్ వల్ల ఇకపై అందులో యూజర్లు స్పాం మెసేజ్‌లను పంపడం కుదరదు. ఏదైనా ఒక మెసేజ్ కనీసం 25 సార్లకు పైగా ఫార్వార్డ్ అయితే దాన్ని వాట్సప్ ఫార్వార్డెడ్ మెసేజ్‌గా గుర్తిస్తుంది.
 స్టికర్స్‌ ఫీచర్‌ కూడా..
దీంతో ఆ మెసేజ్‌ను యూజర్లు బ్లాక్ చేసేందుకు వీలు కలుగుతుంది. ఈ క్రమంలో వాట్సప్‌లో పెద్ద ఎత్తున నకిలీ, స్పాం మెసేజ్‌లను పంపడానికి ఇకపై వీలు కాదు.  ప్రస్తుతం వాట్సప్ ఈ ఫీచర్‌ను అంతర్గతంగా పరిశీలిస్తున్నది. త్వరలో యూజర్లకు దీన్ని అందుబాటులోకి తేనుంది. వాట్సప్ అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే డబ్ల్యూఏబీటాఇన్ఫో ఈ ఫీచర్‌ను స్పాట్‌ చేసింది. ఆండ్రాయిడ్‌ వీ2.18.67 వాట్సప్‌ బీటాలో ఈ ఫీచర్‌ కనిపించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: