చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు షియోమీ తన నూతన స్మార్ట్‌ఫోన్లు రెడ్‌మీ నోట్ 5, నోట్ 5 ప్రొలను గత నెల 14వ తేదీన విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ ఫోన్లను గాను ప్రతివారం ఫ్లాష్ సేల్ నిర్వహిస్తున్నారు. దీంతో ఆ సేల్‌లలో ఇప్పటి వరకు ఈ ఫోన్లు కొన్ని లక్షల సంఖ్యలో అమ్ముడుపోయాయి. 

రిటైలర్లు వీటిని కొనుగోలు చేసి ఎక్కువ ధరకు తిరిగి విక్రయిస్తున్నట్టు ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. మార్చి 7న నిర్వహించిన ఫ్లాష్‌ సేల్‌లో ఈ ఆప్షన్ లేకుండానే ఫోన్లను విక్రయించింది. స్మార్ట్‌ఫోన్ రీ సెల్లింగ్‌ను నియంత్రించేందుకే ఈ సీవోడీ ఆప్షన్‌ను తొలగించినట్టు షియోమీ పేర్కొంది.  ఫ్లిప్‌కార్ట్, షియోమీ అధికారిక వెబ్‌సైట్లలో ఈ ఆప్షన్ లభించదని తేల్చి చెప్పింది.

రెడ్ మీ నోట్ 5 3 జీబీ ర్యామ్, 32 జీబీ ఆన్‌బోర్డ్ మెమొరీ వేరియంట్ ధర రూ.9,999 కాగా, 4జీబీ ర్యామ్, 64 జీబీ వేరియంట్ ధర రూ.11,999. నోట్ 5 ప్రొ 4జీబీ ర్యామ్, 64 జీబీ మొబైల్ ధర రూ.13,999 కాగా, 6జీబీ ర్యామ్, 64 జీబీ ఇన్‌బిల్ట్ మెమొరీ వేరియంట్ ధర రూ.16,999 గా షియోమీ పేర్కొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: