వేసవి కాలంలో వాతావరణం ఒక్కసారే వేడెక్కుతుంది..ఎక్కడికెళ్లినా ఉక్కపోతతో సతమతమవుతారు. చిరాకు, దుర్వాస ఇలా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు..అలాంటి సమయంలో మనకు చల్లని గాలి తగిలితే..వచ్చే ఆనందం అంతా ఇంతా కాదు.  వేసవి కాలంలో ముఖం చాలా జిడ్డుగా తయారవుతుంది..ఎప్పటికప్పుడు నీటితో శుభ్రం చేసుకున్నా జిడ్డు పడుతూనే ఉంటుంది. 
Related image
తాజాగా ఈ సమస్యను తీర్చేందుకు మరో ఆకర్షణీయమైన స్మార్ట్ ఫోన్ గాడ్జెట్ అందుబాటులోకి వచ్చి వైరల్ అవుతోంది. ముఖానికి చెమటలు పడతాయన్న భయం లేకుండా చేసే మినీ ఫ్యాన్ ఒకటి ఇప్పుడు మార్కెట్లో హల్ చల్ చేస్తోంది. అతి తక్కువ ధరకే ఇది అందుబాటులో ఉంది. రెండు రెక్కలతో వివిధ రంగుల్లో వచ్చిన ఈ ఫ్యాన్లను రూ. 66 నుంచి రూ. 249 ధర మధ్య కొనుగోలు చేయవచ్చు.
Image result for mini fan with smart phone
బ్యాటరీ చార్జింగ్ కు ఉపయోగించే పోర్టుకు దీన్ని ఎటాచ్ చేసుకుంటే, బ్యాటరీ చార్జింగ్ తోనే ఇది పని చేస్తుంది. అంతే కాదు ఉచిత హోం డెలివరీ, క్యాష్ ఆన్ డెలివరీ సౌకర్యాలూ ఉన్నాయి. ఇప్పుడీ స్మార్ట్ ఫోన్ మినీ ఫ్యాన్ నెటిజన్ల చేతుల్లోకి శరవేగంగా చేరుతోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: