దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ సంస్థ తన నూతన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు గెలాక్సీ ఎస్9, ఎస్9 ప్లస్‌లను గత నెల కిందట విడుదల చేసిన విషయం విదితమే. కాగా ఈ ఫోన్లు తొలుత 64/256 జీబీ వేరియెంట్లలోనే విడుదలయ్యాయి. ఇక వీటి ప్రారంభ ధరలు రూ.57,900, రూ.64,900గా ఉన్నాయి. అయితే ఇవే ఫోన్లకు చెందిన 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్లు ప్రస్తుతం విడుదలయ్యాయి.
హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డు ఉపయోగించి..
గెలాక్సీ ఎస్9కు చెందిన 128 జీబీ వేరియెంట్ రూ.61,900 ధరకు లభిస్తుండగా, గెలాక్సీ ఎస్9 ప్లస్ 128 జీబీ వేరియెంట్ రూ.68,900 ధరకు లభిస్తున్నది. వీటిని దేశ వ్యాప్తంగా ఉన్న రీటెయిల్ స్టోర్స్‌తోపాటు శాంసంగ్ ఆన్‌లైన్ షాప్‌లోనూ కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్లను కొనే కస్టమర్లకు ఎయిర్‌టెల్ రూ.499, రూ.799 పోస్ట్‌పెయిడ్ ప్లాన్లపై డబుల్ డేటాను అందిస్తున్నది. దీంతోపాటు 1 ఏడాది పాటు ఉచిత అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్, హ్యాండ్ సెట్ డ్యామేజ్ ప్రొటెక్షన్ లభిస్తాయి. జియోలో అయితే రూ.4999 ప్లాన్‌తో రీచార్జి చేసుకుంటే ఏడాది వాలిడిటీ ఉన్న 1 టీబీ మొబైల్ డేటా ఉచితంగా లభిస్తుంది.

డబుల్ డేటా

గెలాక్సీ ఎస్‌ 9 ఫీచర్లు : 5.8కర్వ్‌డ్‌ సూపర్‌ ఎమోలెడ్‌ డిస్‌ప్లే ఆండ్రాయిడ్‌ 8 ఓరియో 1440 x 2960 పిక్సెల్స్‌రిజల్యూషన్‌ 4జీబీర్యామ్‌ 64జీబీస్టోరేజ్‌ 12ఎంపీ కెమెరా 8ఎంపీ సెల్ఫీ కెమెరా 3000 ఎంఏహెచ్‌బ్యాటరీ, గెలాక్సీ ఎస్‌9 ప్లస్‌ ఫీచర్లు : 6.2 డిస్‌ప్లే 1440x2960 రిజల్యూషన్‌ ఆండ్రాయిడ్‌ 8 ఓరియో 6జీబీ ర్యామ్‌ 256జీబీ దాకా విస్తరించుకునే అవకాశం 64జీబీ స్టోరేజ్‌ 12 ఎంపీ డ్యుయల్‌ రియర్‌ కెమెరా 8ఎంపీ సెల్ఫీ కెమెరా 3500 ఎంఏహెచ్‌ బ్యాటరీ


మరింత సమాచారం తెలుసుకోండి: