ఈ మద్య టెక్నాలజీ పెరిగిన తర్వాత యువత ఎక్కువ శాతం సోషల్ మాద్యమాలపై ఆధారపడుతుంది.  ఇక ఫేస్ బుక్, వాట్సాప్ ల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.  ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సాప్ వాడుతున్నారు.  గత కొంత కాలంగా వాట్సాప్ లో కొత్త కొత్త ఫీచర్స్ తీసుకు వస్తున్నారు.  తాజాగా వాట్సాప్ లో మరో ఫీచర్ తీసుకు వచ్చారు. ఒక నంబర్ పై వాట్సాప్ వాడుతున్న వారు కారణమేదైనా గానీ నంబర్ ను మార్చాల్సి రావచ్చు. అప్పుడు నంబర్ మారినట్టు వాట్సాప్ కాంటాక్టులకు విడివిడిగా తెలియజేయాల్సినంత శ్రమ అవసరం లేదు.
Image result for whatsapp new feature
కాంటాక్టుల్లో ఉన్న వారందరికీ లేదా ఎంత మందికి అంటే అంతమందికి ఒకేసారి సులభంగా నంబర్ మారినట్టు చెప్పడం సాధ్యమే. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ ప్రస్తుత బీటా వెర్షన్ (పరీక్షల దశలో ఉన్నది) 2.18.97లో ప్రవేశపెట్టడం జరిగింది.  ప్రస్తుతం ఇది టెస్టింగ్ లో ఉంది..ఇది ఒకే అయితే అందరికీ అందుబాటులోకి వస్తుంది. కొత్త నంబర్ పై వాట్సాప్ ను ఇన్ స్టాల్ చేసుకున్న తర్వాత నంబర్ మారినట్టు తెలియజేసేందుకు ముందుగా వాట్సాప్ సెట్టింగ్స్ లోకి వెళ్లాలి. 
Image result for whatsapp new feature
ఆ తర్వాత అకౌంట్ ఆప్షన్ లోకి వెళితే అందులో చేంజ్ నంబర్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని సెలక్ట్ చేసుకోవాలి. తర్వాత పేజీలో పై భాగం కుడివైపున కార్నర్ లో మీ పాత నంబర్, కొత్త నంబర్ ను ఎంటర్ చేయాలి. నెక్ట్స్ బటన్ ను క్లిక్ చేసి, నోటిఫై మై కాంటాక్ట్స్ ను ఎనేబుల్ చేసుకోవాలి. ఇక్కడ అన్ని కాంటాక్టులు, మీతో చాట్ చేసిన కాంటాక్టులు లేదా కస్టమ్ అనే అప్షన్లు ఉంటాయి. మీకు కావాల్సిన దాన్ని ఎంపిక  చేసుకోగానే అందరికీ నంబర్ మార్పు నోటిఫికేషన్ వెళ్లిపోతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: