బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్న ప్రముఖ మొబైల్‌ ఉత్పత్తుల సంస్థ ఇంటెక్స్‌ మరో కొత్త మోడల్‌ను విడుదల చేసింది. ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ ఫీచర్‌తో ‘ఉదయ్’ అనే ఈ సరికొత్త డివైస్‌ను  భారత మార్కెట్లో విడుదల  చేసింది.  7,999 రూపాయల  బడ్జెట్‌ ధరలో దీన్ని కస్టమర్లకు అందుబాటులో ఉంచింది.

Image result for ఇంటెక్స్

రిలయన్స్‌ జియో ద్వారా 2,200 రూపాయల దాకా క్యాష్‌ బ్యాక్‌  అందిస్తోంది. ప్రస్తుత, కొత్త  జియో కస్టమర్లకు ఇది వర్తిస్తుంది. రూ.198 లేదా రూ.299 ప్లాన్ల రీచార్జ్‌ (44) లపై  50 రూపాయల విలువైన 44 క్యాష్‌బ్యాక్‌ వోచర్లను  మై జియో​ యాప్‌ ద్వారా పొందవచ్చు. ప్రస్తుతం  ఈ ఫోన్‌ను విక్రయించేందుకు వివిధ రిటైల్ అవులెలెట్లతో భాగస్వామ్యాన్ని  కలిగి ఉన్నట్టు ఇంటెక్స్‌  ప్రకటించింది.

Image result for ఇంటెక్స్

ఇంటెక్స్‌ ఉదయ్‌ ఫీచర్లు
5.2 అంగుళాల హెచ్‌డీ స్క్రీన్‌  
1280 × 720 పిక్సల్ రిజుల్యూషన్‌
ఆండ్రాయిడ్ 7 ఆపరేటింగ్‌ సిస్టం
1.3 గిగాహెట్జ్ క్వాడ్ కోర్ మీడియా టెక్ ప్రాసెసర్
3 జీబీ ర్యామ్
32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్  
128 జీబీ వరకు విస్తరించుకునే సదుపాయం
13 మెగాపిక్సెల్  రియర్‌ కెమెరా విత్‌ ఆటోఫోకస్‌ అండ్‌ ఫ్లాష్‌
 5  ఎంపీ సెల్ఫీ కెమెరా
2800 ఎంఏహెచ్‌ బ్యాటరీ 


మరింత సమాచారం తెలుసుకోండి: