Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, May 23, 2019 | Last Updated 8:40 pm IST

Menu &Sections

Search

బడ్జెట్ ధరలో వివో స్మార్ట్‌ఫోన్‌!

బడ్జెట్ ధరలో వివో స్మార్ట్‌ఫోన్‌!
బడ్జెట్ ధరలో వివో స్మార్ట్‌ఫోన్‌!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
చైనీస్‌ హ్యాండ్‌సెట్‌ తయారీదారి వివో తన ‘వై’ సిరీస్‌ను విస్తరించుకుంటూ వెళ్తోంది. ఈ విస్తరణలో భాగంగా ఆల్ట్రా-హెడ్‌ టెక్నాలజీతో ‘వై53ఐ’ స్మార్ట్‌ఫోన్‌ను వివో లాంచ్‌ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర 7,990 రూపాయలుగా కంపెనీ నిర్ణయించింది.  ఈ ఫోన్‌కు ఆల్ట్రా-హెడ్‌ టెక్నాలజీ కూడిన 8 ఎంపీ రియర్‌ కెమెరా, 32ఎంపీ వరకు రెజుల్యూషన్‌ కలిగిన ఫోటోలను తీసే సామర్థ్యం ఉంటుంది.

అదేవిధంగా ఈ ఫోన్‌కు 5ఎంపీ ఫ్రంట్‌ షూటర్‌ ఉంది. ఈ ఫోన్‌కు 5 అంగుళాల డిస్‌ప్లే, 2జీబీ ర్యామ్‌, 16జీబీ స్టోరేజ్‌, 256జీబీ వరకు విస్తరణ మెమరీ, క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 425 ప్రాసెసర్‌, 2500 ఎంఏహెచ్‌ బ్యాటరీలు ఉన్నాయి.  క్రౌన్‌ గోల్డ్‌, మేట్‌ బ్లాక్‌ రంగుల్లో అన్ని ఆఫ్‌లైన్‌ స్టోర్‌లలో ఈ ఫోన్‌ అందుబాటులో ఉంటుంది.

వై53ఐ స్మార్ట్‌ఫోన్‌తో పోటీకరమైన ధర విధానంలో యూజర్లకు మంచి అనుభవాన్ని, అత్యుత్తమమై కెమెరాను అందించేందుకు తమ బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరిస్తున్నామని వివో ఇండియా సీఎంఓ కెన్నీ జెంగీ తెలిపారు.


vivo-budget-smartphone-ap-politics-telangana-polit
5/ 5 - (1 votes)
Add To Favourite
About the author