ప్రపంచంలో టెక్నాలజి రోజు రోజుకీ కొత్త పుంతలు తొక్కుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కమ్యూనికేషన్ విషయంలో ఎంతో అభివృద్ది చెందుతుంది.  ఇక టెలికమ్యూనికేషన్ విషయానికి వస్తే..ఎప్పుడూ కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లు వస్తున్నాయి.  తాజాగా అమేజాన్, చైనాకు చెందిన ఒప్పో సంయుక్తంగా ‘ రియల్ మీ 1’ పేరుతో స్మార్ట్ ఫోన్ ను తీసుకొస్తున్నట్టు స్పష్టమైంది.
Image result for real me 1 phone
ఈ వివరాలను అమేజాన్ ఇండియా తన అమేజాన్ డాట్ ఇన్ వెబ్ సైట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోన్ కేవలం అమేజాన్ వెబ్ సైట్లోనే విక్రయానికి లభించనుంది.ఈ నెల 15న ఈ ఫోన్ వివరాలను వెల్లడించనున్నట్టు పేర్కొంది. ఆ రోజు వివరాలను వెల్లడిస్తుందా లేక ఫోన్ ను ఆవిష్కరించనుందా? అన్న క్లారిటీ అయితే లేదు.
Image result for real me 1 phone
ఒప్పో ఎఫ్ 7 ఫోన్లోనూ వెనుక భాగం బ్లాక్ డైమండ్ డిజైన్ తో ఉంటుందని తెలిసిందే.10,000 డ్రాప్ టెస్ట్ లు (కింద పడేసి చూడడం), లక్ష సార్లు బటన్ టెస్ట్ లు, 10,000 యూఎస్ బీ టెస్ట్ లు చేసినట్టు కంపెనీ ప్రకటించింది.

ఫోన్లో సమస్య వస్తే గంటలోపే రిపేర్ చేసి ఇస్తామనే హామీని ప్రకటించింది. ఫోన్ పట్ల ఆసక్తి కలిగిన వారు అమేజాన్ వెబ్ సైట్లో ‘నోటిఫై మీ అన్న చోట’ తమ ఈ మెయిల్ ఐడీ ఇస్తే ఫోన్ విడుదల రోజున సమాచారం అందిస్తుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: