అత్యాధునిక యుగంలో కూడా ఐమ్యాక్‌, ఐఫోన్‌, ఐపాడ్‌ లాంటి ప్రొడక్ట్‌లతో జనాదరణ పొందుతుంది.  సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ యాపిల్ సరిగ్గా 20 ఏళ్ల కిందట విడుదల చేసిన ఐమ్యాక్ కంప్యూటర్ రంగంలో ఎలాంటి సంచలనాలను సృష్టించిందో అందరికీ తెలిసిందే.  టెక్నాలజీ రంగంలో కొత్త పుంతలు తొక్కుతున్న సమయంలో కంప్యూటర్ రంగంలో పెను మార్పులు వచ్చాయి.
Image result for ఐమ్యాక్ కంప్యూటర్
అప్పట్లో ఐమ్యాక్ కంప్యూటర్  ఒక ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ కంప్యూటర్‌ను విడుదల చేసి నిన్నటికి 20 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఆ విషయాన్ని యాపిల్ సీఈవో టిమ్ కుక్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. 20 ఏళ్ల కిందట అప్పటి యాపిల్ సీఈవో, ఆ సంస్థ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ తొలిసారిగా ఐమ్యాక్‌ను ప్రపంచానికి పరిచయం చేసిన సందర్భంగా తీసిన వీడియోను టిమ్ కుక్ ట్విట్టర్‌లో షేర్ చేశారు.   
Image result for ఐమ్యాక్ కంప్యూటర్
ఐమ్యాక్‌ 15 ఇంచుల సీఆర్‌టీ మానిటర్, 4జీబీ హార్డ్ డ్రైవ్, 90వ దశకం నాటి డిజైన్‌ను కలిగి ఉంది. అయితే ఇప్పటికి ఐమ్యాక్‌లలో అనేక మార్పులు చేర్పులు జరిగాయి. అత్యంత అధునాతనమైన ఆపరేటింగ్ సిస్టమ్, హార్డ్‌వేర్ ఇప్పటి ఐమ్యాక్‌లలో లభిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: