సెల్ ఫోన్ అంటే ఒకప్పుడు నోకియా అనే అనేవారు..ఎందుకంటే..కొత్తలో ఈ బ్రాండ్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. పది సంవత్సరాల క్రితం సెల్ ఫోన్ అంటే నోకియా అనే అనేవారు.  ప్రస్తుతం మార్కెట్ లోకి వివిధ సంస్థలు ఎంటర్ అయ్యాయి.  ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత నోకియా కూడా తన బ్రాండెడ్ విషయంలో ఎన్నో మార్పులు చేర్పులు చోటు చేసుకుంది. తాజాగా నోకియా బ్రాండెడ్‌ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేస్తున్న హెచ్‌ఎండీ గ్లోబల్‌ ‘ఎక్స్‌’ సిరీస్‌లో తన తొలి స్మార్ట్‌ఫోన్‌ను ఎట్టకేలకు చైనాలో విడుదల చేసింది.
Nokia X6 Launched In China - Sakshi
నోకియా ఎక్స్‌6 పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. నాచ్‌ డిస్‌ప్లేతో వచ్చిన తొలి నోకియా స్మార్ట్‌ఫోన్‌ ఇదే కావడం విశేషం. నోకియా 6(2018) ధరకు దగ్గరిలోనే ఈ నోకియా ఎక్స్‌6 ధరను కూడా కంపెనీ నిర్ణయించింది. కేవలం ఈ స్మార్ట్‌ఫోన్‌కు నాచ్‌ డిస్‌ప్లేను అందించడమే కాకుండా... ఆల్‌-గ్లాస్‌ డిజైన్‌ను ఇది అందిస్తోంది. అదనంగా డ్యూయల్‌ రియర్‌ కెమెరా సెటప్‌, స్నాప్‌డ్రాగన్‌ 636 చిప్‌సెట్‌ ఫీచర్లు కూడా దీనిలో ఉన్నాయి.  పేరుతో వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం చైనా మార్కెట్‌లో అందుబాటులో ఉంది.
Image result for నోకియా ఎక్స్‌6 ధర
త్వరలోనే మిగిలిన దేశాల్లోను విక్రయిస్తామని హెచ్ఎండీ గ్లోబల్ వెల్లడించింది. ఈ కొత్త ఫోన్ నోకియా 8 సిరిక్కో ప్రీమియమ్ ఫోన్‌ను పోలి ఉన్నప్పటికీ స్పెసిఫికేషన్లు, ధర మిడ్ రేంజులోనే ఉన్నాయి. 4జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్.. 6జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్లలో నోకియా ఎక్స్6 లభిస్తోంది. 4జీబీ ర్యామ్ వేరియంట్ ధర చైనాలో 1299 యువాన్లు (సుమారు రూ.13వేలు). 6జీబీ మోడల్ ధర 1699 యువాన్లు (సుమారు రూ.18వేలు). తెలుపు, నలుపు, నీలం రంగుల్లో ఈ ఫోన్ లభించనుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: