గత కొంత కాలంగా  మొబైల్స్ తయారీదారు కొత్త కొత్త ఫీచర్స్ తో మార్కెట్ లోకి వస్తున్నారు..అదే సమయంలో బడ్జెట్ ధరలకే అందుబాటులోకి తీసుకు వస్తున్నారు. ఇక దేశీయ మొబైల్స్ తయారీదారు మైక్రోమ్యాక్స్ భారత్‌లో తన మొదటి ఆండ్రాయిడ్ ఓరియో గో ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌ను ఇవాళ లాంచ్ చేసింది. టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌తో భాగస్వామ్యమైన మైక్రోమ్యాక్స్ ఈ ఫోన్‌ను విడుదల చేసింది. 
Image result for micromax mobile
'భారత్ గో' పేరిట విడుదలైన ఈ ఫోన్ అసలు ధర రూ.4,399 గా ఉంది. అయితే ఎయిర్‌టెల్ అందిస్తున్న మేరా పెహ్లా స్మార్ట్‌ఫోన్ ఇనిషియేటివ్‌లో భాగంగా ఈ ఫోన్‌పై రూ.2వేల క్యాష్ బ్యాక్‌ను అందిస్తున్నారు. దీంతో ఈ ఫోన్‌ను రూ.2399 కే వినియోగదారులు పొందవచ్చు. ఇక ఈ ఫోన్‌లో పలు ఆకట్టుకునే ఫీచర్లు యూజర్లకు లభిస్తున్నాయి.


మైక్రోమ్యాక్స్ భారత్ గో ఫీచర్లు :
4.5 ఇంచ్ డిస్‌ప్లే 
854 x 480 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్  
1.1 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్  
1 జీబీ ర్యామ్  
8 జీబీ స్టోరేజ్ 
 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 
 ఆండ్రాయిడ్ 8.1 ఓరియో గో ఎడిషన్ 
 డ్యుయల్ సిమ్  
5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా 
 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్) 
 4జీ వీవోఎల్‌టీఈ 
 బ్లూటూత్ 4.0 
 2000 ఎంఏహెచ్ బ్యాటరీ 


మరింత సమాచారం తెలుసుకోండి: