ఈ మద్య కాలంలో ఎక్కువ శాతం ప్రజలు సెల్‌ఫోన్లు, స్మార్ట్‌ఫోన్లు ఉపయోగిస్తున్నారు. చాలా వరకు  ల్యాండ్ లైన్ ఫోన్ల వినియోగం బాగా తగ్గిపోయింది. ఆఫీసులు తప్ప ఇళ్లలో ల్యాండ్ లైన్ ఫోన్ కనిపించడం చాలా అరుదు అనే చెప్పాలి. అయితే, స్మార్ట్‌ఫోన్లకు దీటుగా ల్యాండ్ ఫోన్లను బీఎస్ఎన్ఎల్ ఆధునికీకరిస్తోంది.  ఇప్పుడు ల్యాండ్ లైన్ లో కూడా కొత్త ఫీచర్ ఆవిష్కరిస్తున్నారు. ల్యాండ్ లైన్ల ద్వారా వీడియో కాల్ చేసేలా సరికొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది.

అంతేకాదు, ఎస్ఎంఎస్, చాటింగ్ చేసుకునేలా ల్యాండ్ ఫోన్లకు సరికొత్త హంగులు అద్దుతోంది. అందులో భాగంగా నెక్స్ట్ జనరేషన్ నెట్‌వర్క్ (ఎన్జీఎన్) పేరిట టెలిఫోన్ ఎక్స్‌చేంజీలను ఆధునికీకరిస్తోంది. పైలెట్ ప్రాజెక్టుగా తొలుత రాజస్థాన్‌లో ఈ మోడల్‌ను ప్రవేశపెడుతోంది బీఎస్ఎన్ఎల్. స్మార్ట్‌ఫోన్‌లో ఉండే ప్రత్యేకమైన ఎస్ఎంఎస్, చాటింగ్, వీడియో కాలింగ్, పర్సనల్ రింగ్ టోన్ ఫీచర్లను ల్యాండ్ ఫోన్లలోనూ అందుబాటులోకి తెస్తున్నట్టు ఆయన తెలిపారు.

అయితే, ఆ ఫీచర్ల సేవలను పొందాలనుకుంటే మాత్రం.. ఫోన్‌ను ఐపీ ఫోన్‌కు మారాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. దాంతో పాటు ల్యాండ్ లైన్‌కు వచ్చే ఫోన్లను సెల్‌ఫోన్ల ద్వారా రిసీవ్ చేసుకోవచ్చని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో నెట్ స్పీడ్ పెరిగేలా 86 సెల్ టవర్లను 2జీ నుంచి 3జీకి ఆధునికీకరించినట్టు చెప్పారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: