మొబైల్ మార్కెట్‌లో మధ్యతరగతి ప్రజలకు అతి దగ్గరగా ఉన్న కంపెనీ షియోమీ. ప్రస్తుతం స్మార్ట్ టీవీ మార్కెట్‌లో కూడా దూసుకుపోతోంది.  షియోమీ ఎంఐ 8 ఎస్‌ఈ స్మార్ట్‌ఫోన్ బ్లాక్, బ్లూ, రెడ్, గోల్డ్ రంగుల్లో వినియోగదారులకు జూన్ 8 నుంచి చైనా మార్కెట్‌లో లభ్యం కానుంది. ఈ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్, 64 జీబీ వేరియెంట్ రూ.18,960 ధరకు లభ్యం కానుండగా, 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.21,070 ధరకు లభ్యం కానుంది.  షియోమీ ఎంఐ 8 ఎస్‌ఈ లో 5.88 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు.

6 జీబీ పవర్‌ఫుల్ ర్యామ్‌ను ఏర్పాటు చేయడం వల్ల ఫోన్ వేగంగా పనిచేస్తుంది. ఫోన్ వెనుక భాగంలో 12, 5 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న రెండు కెమెరాలను అమర్చారు. అలాగే ముందు భాగంలో 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను ఏర్పాటు చేశారు. దీంతో ఫొటోలు, వీడియోలు పర్‌ఫెక్ట్‌గా వస్తాయి. ఫోన్ వెనుక భాగంలో ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు. ఇక ఈ ఫోన్ డిజైన్ అచ్చం ఐఫోన్ X ను పోలి ఉంటుంది. 


ఈ ఫోన్ ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి :
5.88 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
2244 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్
4/6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 8. ఓరియో, డ్యుయల్ సిమ్
12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఫింగర్‌ప్రింట్ సెన్సార్
యూఎస్‌బీ టైప్ సి ఆడియో
 డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ
 డ్యుయల్ బ్యాండ్ వైఫై
బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ
 యూఎస్‌బీ టైప్ సి
 3120 ఎంఏహెచ్ బ్యాటరీ
 క్విక్ చార్జ్ 3.0.



మరింత సమాచారం తెలుసుకోండి: