ప్రపంచంలో టెక్నాలజీ మారుతున్న కొద్ది టెలీకాం రంగంలో కూడా పెను మార్పులు వస్తున్నాయి.  సెల్ ఫోన్ రంగంలో ఇప్పుడు వస్తున్న మార్పులు చేర్పుల వల్ల వినియోగదారులకు అరచేతిలో ప్రపంచాన్ని చూసే వీలు కలుగుతుంది.  అంతే కాదు తమ వారిని లైవ్ లో చూస్తూ చాటింగ్, మాట్లాడుకునే సౌలభ్యం కూడా వచ్చింది.

భారత దేశంలో ప్రస్తుతం జియో వచ్చిన తర్వాత ఇతర నెట్ వర్క్స్ లో ఎన్నో మార్పులు వచ్చాయి. రోజు రోజు కీ టారీఫ్ లలో కస్టమర్లను ఆకర్షించుకోవడానికి నానా తంటాలు పడుతున్నాయి. టెలికాం కంపెనీ ఐడియా రూ.149 కే ఓ నూతన ప్రీపెయిడ్ ప్లాన్‌ను ఇవాళ ప్రవేశపెట్టింది. దేశంలో ఉన్న అన్ని సర్కిల్స్‌కు చెందిన ప్రీపెయిడ్ వినియోగదారులకు ఈ ప్లాన్ అందుబాటులో ఉందని ఐడియా వెల్లడించింది.

రోజుకు 250 నిమిషాలు, వారానికి 1000 నిమిషాల కాల్స్ చేసుకోవచ్చు.  అంతే కాదు ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు వస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీ 21 రోజులు ఉండగా దీంట్లో వినియోగదారులకు ఎలాంటి డేటా బెనిఫిట్స్ రావు. కాకపోతే ఈ ప్లాన్ ఉన్నవారు రూ.92 ను రీచార్జి చేసుకుంటే 7 రోజుల వాలిడిటీతో 6 జీబీ డేటా వస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: