ప్రస్తుతం ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ జమానా నడుస్తుంది.  సామాన్య పౌరులు సైతం స్మార్ట్ ఫోన్లు యూజ్ చేస్తున్నారు.  దాంతో మార్కెట్ లోకి రక రకాల ఫీచర్స్ తో అతి తక్కువ ధరలో స్మార్ట్ ఫోన్లు లభ్యమవుతున్నాయి.  తాజాగా చైనా మొబైల్ సంస్థ కోమియో తన నూతన స్మార్ట్‌ఫోన్ కోమియోఎక్స్1 ను తాజాగా విడుదల చేసింది. 


5.50 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 720 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ గల ఈ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రూ.7,499 ధరకి లభిస్తుంది. 2జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఈ మొబైల్ కి వెనుక భాగంలో 13 మెగాపిక్సల్ కెమెరా, ముందు భాగంలో 8 మెగాపిక్సల్ కెమెరాని అమర్చారు. 


ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టంతో నడిచే ఈ స్మార్ట్‌ఫోన్లో డ్యుయల్ సిమ్, 4జీ వీవోఎల్‌టీఈ, 3050 ఎంఏహెచ్ బ్యాటరీలాంటి పలు ఆకట్టుకొనే ఫీచర్లు ఉన్నాయి. సన్ రైజ్ గోల్డ్, రాయల్ బ్లాక్, రెడ్ రంగుల్లో ఈ స్మార్ట్‌ఫోన్ లభిస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: