ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో మరో అదిరిపోయే ఫీచర్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. ఇకపై యూజర్లు అందులో గ్రూప్ వీడియో కాలింగ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ గురించి వాట్సాప్ గతంలోనే హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం ఈ ఫీచర్ యూజర్లకు లభిస్తున్నది. వాట్సాప్‌ గ్రూప్‌ కాలింగ్‌ ఫీచర్‌ వాయిస్‌, వీడియో రెండింటికీ సపోర్ట్‌ చేస్తూ ఎట్టకేలకు లైవ్‌గా యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఇకపై యూజర్లు గ్రూప్ వీడియో, వాయిస్‌ కాలింగ్ చేసుకోవచ్చు.

Image result for గ్రూప్ వీడియో కాలింగ్

ఈ ఫీచర్ గురించి వాట్సాప్ గతేడాది అక్టోబర్‌లోనే సంకేతాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మే నెలలో ఫేస్‌బుక్‌ తను యాన్యువల్‌ ఎఫ్‌8 డెవలపర్‌ కాన్ఫరెన్స్‌లో వాట్సాప్‌ గ్రూప్‌ కాలింగ్‌ ఫీచర్‌ను ప్రకటించింది. అయితే ముందుగా ఇద్దరు యూజర్లు వన్ టు వన్ వీడియో చాటింగ్ మొదలు పెట్టాలి. అనంతరం ఇద్దరు యూజర్లను అందులోకి యాడ్ చేయాలి.

Image result for గ్రూప్ వీడియో కాలింగ్

దీంతో గ్రూప్ వీడియో కాలింగ్ సాధ్యపడుతుంది. వాట్సాప్ గ్రూప్ వీడియో, వాయిస్‌ కాలింగ్ ఫీచర్ కోసం.. ఈ యాప్‌కు చెందిన అప్‌డేటెడ్ వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటే ఈ ఫీచర్‌ను యూజర్లు పొందవచ్చు. గ్రూప్‌ కాల్‌ చేయాలంటే, తొలుత ఒక యూజర్‌తో వీడియో, వాయిస్‌ కాల్‌ ప్రారంభించాలి.  వాట్సాప్ గ్రూప్ వీడియో కాలింగ్ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు అందుబాటులో ఉంది. ఈ యాప్‌కు చెందిన అప్‌డేటెడ్ వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటే గ్రూప్ వీడియో కాలింగ్ ఫీచర్‌ను యూజర్లు పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: