స్మార్ట్ ఫోన్స్ లో దిగ్గజమైన కంపెనీగా పేరొందిన ఆపిల్ మరో మారు స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థలకి దిమ్మతిరిగే షాక్ ఇవ్వబోతోందట..ఇప్పటి వరకూ ఎన్నడూ లేని విధంగా ఆధునాత ఫీచర్స్ తో ఆపిల్ కొత్తరకంగా తన మొబైల్స్ ని టెక్నాలజీ రంగంలోకి దింపుతోందని అంటున్నారు.. ఇందులో భాగంగా ఈ ఏడాది(2018లో) మూడు రకాల  “ఐ ఫోన్ల” ను లాంచ్ చేసేందుకు తీవ్రమైన కసరత్తు చేస్తుంది. ఎంట్రీ లెవల్‌ డివైజ్‌ను 6.1 అంగుళాల స్క్రీన్‌లో ఇతర వేరియంట్లను 5.8 అంగుళాలు, 6.46 అంగుళాలలో లాంచ్‌ చేయడానికి సిద్దంగా ఉంది.

 Image result for apple phones 2018

మరి  ఐ ఫోన్ పోటీ ప్రపంచంలోకి ఎప్పుడు దిగనున్నాయంటే ఇద్దరు జర్మన్‌ టెలికాం ఆపరేటర్లు చెప్పిన సమాచారం ప్రకారం ఆపిల్‌ ఈ మూడు ఐఫోన్లను సెప్టెంబర్‌ 12న కాలిఫోర్నియాలోని స్టీవ్‌ జాబ్స్‌ థియేటర్‌లో లాంచ్‌ చేయనుందని తెలిసిందట..వీటి ప్రీ-ఆర్డర్లు కూడా వెంటనే సెప్టెంబర్‌ 14నే ప్రారంభం కాబోతున్నాయట..అయితే ఈ డివైజ్‌లు సెప్టెంబర్‌ 21 నుంచి అందుబాటులోకి వస్తాయని అభిప్రాయ పడుతున్నారు.

 Image result for apple phones 2018

ఇదిలాఉంటే ఆపిల్‌ అప్‌కమింగ్‌ స్మార్ట్‌ఫోన్ల గురించి సోషల్ మీడియాలో పలు ఆసక్తికరమైన విషయాలు చక్కర్లు కొడుతున్నాయి.. స్టైలస్‌ ఫీచర్‌ అంటే ఆపిల్‌ పెన్సిల్‌ సపోర్టుతో ఈ స్మార్ట్‌ఫోన్లు మార్కెట్‌లోకి వస్తున్నాయట...ఈ వార్తతో రానున్న ఐ ఫోన్ లపై మరింత క్రేజ్ పెరిగిపోయిందట.. 4జీబీ ర్యామ్‌,  ప్రముఖ ఫేస్‌ఐడీ ఫీచర్‌ను ఇవి కలిగి ఉంటాయని సమాచారం.

 


మరింత సమాచారం తెలుసుకోండి: