శామ్‌సంగ్‌ మొబైల్ కంపెనీ తన మొబైల్స్ ఖాతాలోకి మరొక న్యూ ప్రోడక్ట్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది.. శామ్‌సంగ్‌ కస్టమర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అధునాతనమైన ఈ మొబైల్ అందుబాటులోకి వచ్చింది...అదే “గెలాక్సీ నోట్‌ 9” ఈ మొబైల్ లో ఫీచర్స్ లో చెప్పుకోదగ్గది ముఖ్యమైనది ఏమిటంటే..కృత్రిమ మేధ కలిగిన అధునాతన స్మార్ట్‌ఫోన్‌

 Image result for samsung galaxy note 9 launched ap

 ఈ మొబైల్ ఫోన్ లో స్క్రీన్‌షాట్‌ను వాయిస్‌ ద్వారా సైతం పంపగలిగే బిక్స్‌బితో అందుబాటులోకి వచ్చింది  ఈ మొబైల్‌.. 6.4 అంగుళాల  డిస్‌ప్లే తో ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది... 845 స్నాప్‌డ్రాగ్‌ ప్రాసెసర్,  4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ స్పెసిఫికేషన్లను కలిగిఉన్నట్లు శామ్‌సంగ్‌ వెల్లడించింది. 128 జీబీ ధర రూ.67,900 కాగా, 512 జీబీ ఫోన్‌ ధర 84,900 ఉన్నట్లు తెలిపింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ అన్ని మొబైల్ రిటైల్ సంస్థలలో వివిధ నగరాలలో లాంచ్ చేసింది

 Image result for samsung galaxy note 9

హైదరాబాద్ లోని హైటెక్‌సిటీ బిగ్‌ సీ షోరూంలో సీఎండీ యం బాలు చౌదరి, సినీనటి పూజా హెడ్గే ఫోన్‌ను విడుదలచేశారు. సంస్థ డైరెక్టర్లు వై. స్వప్నకుమార్, జి బాలాజి రెడ్డి, అమిత్‌విగ్‌ (సేల్స్‌అవుట్‌ హెడ్‌) ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు...అయితే ఈ మొబైల్ ఫోన్ లాంచ్ చేసిన గంటల వ్యవధిలోనే అధికమొత్తంలో ఫోన్స్ అమ్ముడు పోయాయిఅంటూ సంస్థ వెల్లడించింది.  

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: