స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో ఎన్నో రకాల మొబైల్ ఫోన్ మరెన్నో రకాల విశిష్టతలు అయితే ఒక మొబైల్ ఫోన్ కి ఉన్న ఫీచర్స్ మరొక మొబైల్ ఫోన్ కి ఉండవు ఒక వేళ ఉన్నా వాటి ధర సామాన్యుడు కొనే విధంగా ఉండవు..అందుకే చైనాకి చెందిన మొబైల్స్ ఫోన్స్ కంపెనీ షియోమీ భారత దేశ మార్కెట్ లోకి అతి తక్కువ ధరకే అన్ని అధునాతన ఫీచర్స్ లో ఉన్న స్మార్ట్ ఫోన్ ని మార్కెట్ లోకి దింపింది..ఈ ఫోన్స్ ని మధ్యతరగతి వారిని దృష్టిలో పెట్టుకుని రూపొందించారు..

 

న్యూఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ ఫోన్‌ను షియోమీ పోకో ఎఫ్‌ 1గా దీనికి బ్రాండ్‌ పేరు పెట్టారు. స్నాప్‌డ్రాగన్‌ 845 ప్రాసెసర్‌తో కూడిన ఈ మొబైల్‌ ఫోన్‌ మూడు మోడళ్లుగా విడుదల చేశారు..6జీబీ ర్యామ్‌, 64జీబీ ఇంటర్నల్‌ మెమరీతో కూడి ఉన్న మొదటి మోడల్‌ ధర రూ.20,999లుగా, 6జీబీ ర్యామ్‌, 128జీబీ ఇంటర్నల్‌ మె మరీతో కూడిన ఫోన్‌ ధర రూ.23,999లుగా నిర్ణయించారు. ఇక 8జీబీ ర్యామ్‌, 256జీబీ వర్షన్‌ ధర రూ.28,999లుగా ఉంది. ఈ ఫోన్‌ ఆసస్‌ జెన్‌ఫోన్‌ 5జెడ్‌, వన్‌ప్లస్‌ 6, వివో నెక్స్‌ ఫోన్‌లకు పోటీగా మార్కెట్‌లోకి వచ్చింది.

Image result for xiaomi pocophone f1

 అయితే ఈ  షియోమీ పోకో ఎఫ్‌ 1 ఫోన్‌ కేవలం ఆన్‌లైన్‌ ద్వారా ఫ్లిప్‌కార్ట్‌లో కానీ, మీ డా ట్‌ కామ్‌ వెబ్‌సైట్‌లో మాత్రమే కొనుగోలుకు అందుబాటు లో ఉంటుందని తెలిపింది ఈనెల 29 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్‌ అమ్మకాలు అధికారికంగా ప్రారంభమవుతాయి.,,ఆం డ్రాయిడ్‌ 9 పై వర్షన్‌ అప్‌డేట్‌ ఈ ఫోన్‌లకు ఈ ఏడాది చివరిలోగా లభించే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: