రాయల్ ఎన్ఫీల్డ్ యువతలో మంచి క్రేజ్ ఉన్న బైక్ ఈ బైక్ పేరుకు తగ్గట్టుగా ఎంతో రాయల్ గానే ఉంటుంది..ఎంతో హుందాగా బైక్స్ లో రారాజుగా ఉండే ఈ క్రేజీ బైక్ భారత మార్కెట్ లో గతంలో కంటే ఇప్పుడు పెను సంచలనం సృష్టిస్తోంది..రికార్డు ధరలో వాహనాలు అమ్ముడు పోతున్నాయి..యూత్ లో కూడా ఈ బైక్ లకి మంచి క్రేజ్ ఉండటంతో మరింత డిమాండ్ పెరిగిపోయింది..లక్ష పై మాటే ఉన్న ఈ బైక్ లకి ఆదరణ కూడా అలాగే ఉంది.

Related image

 అయితే ఈ బైక్ లలో ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ విపణిలోకి దింపుతూనే ఉన్నారు అయితే తాజాగా మార్కెట్లోకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ కంపెనీ కొత్త మోడల్‌ ని క్లాసిక్‌ సిగ్నల్స్‌ 350 పేరుతో , ధర రూ.1,58,861గా (ఎక్స్‌ షోరూమ్, బెంగళూరు) నిర్ణయించినట్లు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌  కంపెనీ బిజినెస్‌ హెడ్‌ (ఇండియా) షాజి కోషే చెప్పారు. ఈ కొత్త బైక్‌ రెండు రంగుల్లో అందుబాటులో ఉందట. అయితే దీని ప్రత్యేకత ఏమిటంటే..

 Image result for royal enfield classic signals 350

 ఈ సరి కొత్త రాయల్ బైక్ కి స్టీల్‌ ఇంజిన్‌ గార్డ్స్‌ వంటి 40 ప్రత్యేక యాక్సెసరీలతో మునుపెన్నడూ లేని విధంగా ఎంతో కొత్తగా ఉంటుందని అంటున్నారు..ఈ బైక్‌ను 346 సీసీ ఎయిర్‌–కూల్డ్‌ సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్‌తో రూపొందించామని, 5 గేర్లు,  క్రాష్‌ గార్డ్స్, పెద్ద విండ్‌స్క్రీన్లు వంటి ప్రత్యేకతలున్నాయని కంపెనీ బిజినెస్ హెడ్ తెలిపారు...అయితే 1950 నుంచి భారత సైనిక దళాలకు ఈ బైక్‌ల సరఫరాలను ప్రారంభించామని, భారత సైన్యానికి అత్యధిక బైక్‌లను సరఫరా చేసిన ఘనత తమదేనని రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ కంపెనీ ప్రెసిడెంట్‌ రుద్రతేజ్‌ సింగ్‌ తెలిపారు.

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: