మొబైల్ రంగంలో రారాజుగా వెలుగొందుతున్న చైనా మొబైల్ కంపెనీ షావోమీ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో దూసుకు పోయింది పోకో సబ్‌బ్రాండ్‌ ద్వారా లాంచ్‌ చేసిన పోకో ఎఫ్‌ 1 కి ఊహించని రీతిలో భారీ సేల్ ని నమోదు చేసుకుంది... ఆగస్టు 29న ఫ్లిప్‌కార్ట్‌, ఎంఐ.కాం ద్వారా నిర్వహించిన ఫ్లాష్‌ సేల్‌లో   దిమ్మతిరిగేలా ఆదాయాన్ని సంపాదించింది...అయితే ఇప్పటి వరకూ ఇంత భారీ సెల్ జరగలేదని కంపెనీ పేర్కొంది.

 Image result for xiaomi pocophone f1

అలాగే  తదుపరి ఫ్లాష్‌సేల్‌  సెప్టెంబరు 5న  ఉంటుందని అయితే విక్రయించిన స్మార్ట్‌ఫోన్ల సంఖ్యను సంస్థ అధికారికంగా వెల్లడించకపోయినప్పటికీ టాప్ వేరియంట్ స్మార్ట్‌ఫోన్‌లో 68వేల యూనిట్లను అదేవిధంగా..లక్షల దాకా బేస్ వేరియంట్‌ డివైస్‌లను వినియోగదారులు కొనుగోలు చేసినట్టు అంచనా.కాగా పోకో ఎఫ్‌ 1 స్మార్ట్‌ఫోనును మూడు స్టోరేజ్‌ ఆప్షన్లలో లాంచ్‌ చేసిన సంగతి తెలిసిందే. 

 Image result for xiaomi pocophone f1

అయితే ఈ మొబైల్ బేస్ వేరియంట్ 6జీబీర్యామ్‌/64  స్టోరేజ్‌ ధర .20,999 గానూ,  అదేవిధంగా రెండవ వేరియంట్  6జీబీర్యామ్‌/128 స్టోరేజ్‌ ధర 23,999 రూపాయలుగాను..ఇక టాప్ ఎండ్  వేరిఎంట్ ధర 8జీబీర్యామ్‌/256 స్టోరేజ్‌ రూ .28,999గా నిర్ణయించింది. దీంతో పాటు స్పెషల్‌ ఎడిషన్‌ రెడ్‌ వేరియంట్‌ రూ. 29,999 ధరలో కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: