గుండు సూది నుంచీ బ్లూటూత్ ల వరకూ అన్నిటిలో ఫేక్ వస్తువులు దింపేస్తున్నారు ఫేక్ గాళ్ళు..మార్కెట్ లోకి కొత్త ఎలక్ట్రానిక్ వస్తువు వస్తే చాలు అచ్చం అలాంటిదే వెంటనే నకేలీ వస్తువులు మార్కెట్ లో హల్చల్ చేస్తాయి ఏది నకిలీ ఏది నకిలీ కాదో చెప్పడం ఆ కంపెనీ వాడికి కూడా సాధ్యం కాదు అనేట్టుగా వస్తువులని తయారు చేస్తున్నారు..అయితే ఇప్పుడు అత్యధికంగా ఈ ఫేక్ వస్తువులు మొబైల్ రంగంలో హల్చల్ చేస్తున్నాయి ముఖ్యంగా అన్ని మొబైల్ చార్జర్స్ ని ఫేక్ చేసి బ్లాక్ మార్కెట్ లోకి దింపేస్తున్నారు..అయితే మరి ఏది ఒరిజినల్ ఏది ఒరిజినల్ కాదో తెలుసుకోవడం ఇలా చాలా సులభం మరి అది ఎలాగో చూద్దామా..?

 Image result for how to find fake chargers

 

Apple చార్జర్

మీరు Apple చార్జర్ వాడే వారైతే చార్జర్ పైన ఉన్న కొన్ని పదాలు మరియు లోగో ద్వారా తెలుసుకోవచ్చు .ఒరిజినల్ చార్జర్ పైన 'Designed by Apple in California' అని రాసి ఉంటుంది అలాగే ఆపిల్ యొక్క లోగో కూడా డార్క్ కలర్ లో ఉంటుంది. ఒక వేళ మీ చార్జర్ పై ఏ ఒక్కటి లేకపోయన అది నకిలీ చార్జర్ అని తెలుసుకోండి .

 Image result for apple fake charger how to identify


Samsung చార్జర్

Samsung చార్జర్ వాడే వారైతే చార్జర్ పైన ఉన్న కొన్ని అక్షరాలు మరియు లోగో ద్వారా తెలుసుకోవచ్చు. మీ ఛార్జర్ నకిలీ అయినట్లయితే, అడాప్టర్ దానిపై 'A +' మరియు 'మేడ్ ఇన్ చైనా' అనే పదాలను కలిగి ఉంటుంది.

Image result for fake chargers

 OnePlus చార్జర్

OnePlus తాజాగా విపణిలోకి వచ్చిన ఈ మొబైల్ కంపెనీ  దాని అత్యంత డాష్ చార్జర్  వేగంగా ఛార్జింగ్ టెక్నాలజీల్లో ఒకటిగా పేరు పొందింది.మీరు ఎప్పుడు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు OnePlus అడాప్టర్ కు కనెక్ట్ చేసిన తర్వాత, మీ ఫోన్ బ్యాటరీ చిహ్నాన్ని ఒక ప్రామాణిక ఛార్జింగ్ చిహ్నంతో కాకుండా ఫ్లాష్ సింబల్ తో పాటు కలుపుతుంది

Image result for one plus fake charger identified

 Xiaomi Mi చార్జర్

Xiaomi Mi చార్జర్ నిజమైనదో లేక నకిలీధో చాలా సులువుగా తెలుసుకోవచ్చు . Mi చార్జర్ కేబుల్ యొక్క పొడవు ఐడెంటిఫైయర్లా పనిచేస్తుంది, ఎందుకంటే అసలు కేబుల్ 120cms కంటే ఎక్కువగా ఉంటుంది , ఇది చాలా పెద్ద అడాప్టర్ మాడ్యూల్ తో ఉంటుంది.

 Image result for Xiaomi Mi  fake charger identified

Huawei చార్జర్

నకిలీ Huawei ఛార్జర్ ను గుర్తించేందుకు, చార్జర్ ఫై ఉన్న బార్ కోడ్ సమాచారాన్ని స్కాన్ చేసి, అడాప్టర్లో ముద్రించిన వివరాలతో సరిపోలుతుందో లేదో తనిఖీ చేయండి.అవి రెండూ అసలు చార్జర్ కి సమానంగా ఉంటాయి.

 Image result for Huawei charger identified

 

Google Pixel చార్జర్

ఒక పిక్సెల్ స్మార్ట్ ఫోన్ ఛార్జర్ యొక్క వాస్తవికతను తనిఖీ చేయడానికి ఏకైక మార్గం ఒకటే ఫోన్ ని అడాప్టర్ కి కనెక్ట్ చేసినప్పుడు ఛార్జింగ్ చాల ఫాస్ట్ గా ఉంటుంది. Google దాని స్మార్ట్ ఫోన్లలో చాల వేగంగా ఛార్జింగ్ ని అందిస్తుంది ఒకవేళ ఛార్జర్ యూనిట్ నకిలీ అయినట్లయితే ఛార్జింగ్ స్పీడ్ నెమ్మదిగా ఉంటుంది.

 Image result for Google Pixel Charger identified


మరింత సమాచారం తెలుసుకోండి: