టెలికాం దిగ్గజ సంస్థలు అన్నీ ఇప్పుడు వినియోగ దారులకి ఏ రీతిలో ప్లాన్స్ కావాలో ఆ రీతిగా వినియోగ దారుల అభిరుచులకి తగ్గట్టుగా తమ ప్లాన్స్ మార్చుకుంటున్నాయి..జియో రాక మునుపు టెలికాం సంస్థలు ఎటువంటి ప్లాన్ అమలు చేస్తారో దానిని బట్టి కస్టమర్లు ప్లాన్స్ ఎంచుకునే వారు కానీ జియో రాకతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది..వినియోగదారుడు అడిగిన విధంగా ప్లాన్స్ ని దిగ్గజ సంస్థలు మార్చుకునే పరిస్థితికి వచ్చింది.

Image result for airtel 289 offer

 ఈ పోటీ ప్రపంచంలో ముఖ్యంగా టెలికాం లాంటి రంగంలో కస్టమర్లని కాపాడుకుంటూ వారికి సేవలని అందించడం అంత సులభమైన విషయం కాదు అయితే ఎయిర్టెల్ ఈ విషయంలో ఒక్కో మెట్టు దిగుతోందనే చెప్పాలి..కొన్ని రోజుల క్రితం 399 ప్లాన్ తో 10జీబీ నెట్వర్క్ తో వచ్చిన ఎయిర్టెల్ కొత్త స్కీం వినియోగదారులకి కొంత ఊరట కలిగించింది దాంతో మరో సరికొత్త ప్లాన్ తో ఎయిర్టెల్ ముందుకు వచ్చింది..అదేంటంటే

Image result for airtel 289 offer

 ఎయిర్‌టెల్ రూ.289కి మరో నూతన ప్రీపెయిడ్ ప్లాన్‌ను వినియోగ దారులకి అందుబాటులోకి తీసుకు వచ్చింది.ఈ ప్లాన్‌ను రీచార్జి చేసుకునే కస్టమర్లకు రోజుకు 1జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ వస్తాయి. ఇక ఈ ప్లాన్ వాలిడిటీని 48 రోజులుగా నిర్ణయించారు. కాగా ఎయిర్‌టెల్‌లో రూ.299కి మరో ప్లాన్ అందుబాటులో ఉంది. ఇందులో కస్టమర్లకు రోజుకు 1.4 జీబీ డేటా లభిస్తుంది. మిగిలిన బెనిఫిట్స్ అలాగే వస్తాయి. ఇక ఈ ప్లాన్ వాలిడిటీ 42 రోజులు.


మరింత సమాచారం తెలుసుకోండి: