అమెజాన్ లో వస్తువులని వాయిదాల పద్దతిలో తీసుకోవాలి అంటే తప్పనిసరిగా “క్రెడిట్ కార్డ్”  అవసరం ఒక్క అమెజాన్ లో మాత్రమే కాదు వాయిదాల పద్దతిలో ఎక్కడ వస్తువులు కొనుగోలు చేయాలి అన్నా సరే క్రెడిట్ కార్డ్ తప్పని సరి..అయితే ఇప్పుడు విశ్వవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది అమెజాన్ వినియోగదారుల కోసం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది అమెజాన్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది..అదేంటంటే మీకు క్రెడిట్ కార్డ్ లేకపోయినా పవరవలేదు మారు మాకు ఎంతో ముఖ్యమైన కస్టమర్స్ అంటూ వాయిదాల పద్దతిలో డెబిట్ కార్డ్ తో మీకు కావాల్సిన వస్తువులు అమెజాన్ లో కొనుగోలు చేసుకోండి అంటూ బంపర్ ఆఫర్ ప్రకటించింది.

 

ఏంటి ఒక్క సారిగా షాక్ అయ్యారా..? ఇది నిజమే అమెజాన్‌లో ఇప్పుడు అమెజాన్ పే ఈఎంఐ పేరిట ఓ కొత్త సౌకర్యం అందుబాటులోకి వచ్చింది...ఈ విధానం ఎలా వాడాలి అంటే..భారత్‌లో అమెజాన్ యాప్‌ను వాడుతున్న మొబైల్ యాజర్లు యాప్‌లోకి వెళ్లి  “అమెజాన్ పే ఈఎంఐ” లో రిజిస్టర్ చేసుకోవాలి. అందుకు గాను వారు తమ తమ ఆధార్...పాన్ వివరాలను ఇవ్వాలి. దీంతో అమెజాన్ పే ఈఎంఐ క్రెడిట్ లిమిట్‌ను నిర్ణయిస్తారు.

 Image result for amazon

ఆ తరువాత నిర్దేశించిన మొత్తంలో క్రెడిట్ లిమిట్‌తో “అమెజాన్ పే ఈఎంఐ” యాక్టివేట్ అవుతుంది. ఈ క్రమంలో యూజర్స్ ఆ అకౌంట్‌కు తమ డెబిట్ కార్డును లింక్ చేయాలి. దీంతో ప్రాసెస్ పూర్తవుతుంది. తరువాత యూజర్లు అమెజాన్ పే ఈఎంఐ ఉపయోగించి అమెజాన్‌లో వస్తువులను కొనుగోలు చేయవచ్చు....అయితే అమెజాన్ పే ఈఎంఐ విధానంలో వస్తువులను కొనాలంటే యూజర్లు మినిమం  రూ.8వేలు ఆపైన విలువైన ఒకే వస్తువును ఎంచుకోవాలి. అనంతరం చెక్ అవుట్ చేసే సమయంలో “అమెజాన్ పే ఈఎంఐ” ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

 Image result for amazon emi

అయితే  ఆభరణాలు, గిఫ్ట్ కార్డులు, అమెజాన్ పే ఈఎంఐ పనిచేయదు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటింటే  హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కెనరా బ్యాంక్, సిటీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లకు చెందిన ఖాతాదారులకు మాత్రమే “అమెజాన్ పే ఈఎంఐ”  లభిస్తున్నది...అదీనూ కేవలం అమెజాన్ మొబైల్ యూజర్లకు మాత్రమే ఈ సదుపాయాన్ని అందిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: