ప్రముఖ స్మార్ట్‌ఫోన్స్ తయారీదారు వివో తన నూతన 'వివో వి9 ప్రొ'ను కొద్దిరోజుల క్రితం ఇండోనేసియాలో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. బుధవారం (సెప్టెంబరు 26) ఉదయం 10 గంటలకు భారత్‌లో 'వివో వి9 ప్రొ'ను ఆవిష్కరించింది.   ఈ ఫోన్ ధరను రూ.19,990గా కంపెనీ ప్రకటించింది. అయితే అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌లో  రూ. 2వేల డిస్కౌంట్‌తో 17,999లకే లభ్యం కానుంది.


ఈ  సేల్‌ ముగిసిన అనతరం ఈ స్మార్ట్‌ఫోన్‌ ఎంఆర్‌పీ ధర 19,990గా ఉంటుంది. 6జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌తో విడుదలైన ఈ ఫోన్లను అమెజాన్ ఇండియా వెబ్‌సైట్ ద్వారా భారత్‌లో విక్రయించనున్నారు.  పలు ఆకట్టుకునే ఫీచర్లను కలిగి ఉన్న ఈ ఫోన్ 'షియోమి ఎంఐ ఏ2'కి గట్టి పోటీ ఇవ్వనుంది.


వివో వి9 ప్రో ప్రత్యేకతలు: ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 6.3" ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే (2280 x 1080 రిజల్యూషన్),6 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ (256 జీబీ వరకు పెంచుకునే సౌకర్యం),ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం (ఫన్ టచ్ ఓఎస్ 4.0),13/2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు,16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,ఫింగర్ ప్రింట్ సెన్సార్,3260 ఎంఏహెచ్ బ్యాటరీ


మరింత సమాచారం తెలుసుకోండి: