టెలికం రంగంలో రోజు రోజు కి ఒక్కో టెలికం దిగ్గజం హీరో అవుతోంది.. మారుతున్న కాలానికి అనుగుణంగా పోటీ ప్రపంచంలో ప్రత్యర్ధుల దాటి నుంచి తప్పుకునే విధంగా  టెలికం నెట్ వర్క్స్ అన్ని తమ తమ టారిఫ్ ల విషయంలో ఒక్కో మెట్టు కిందకి దిగవలసిన పరిస్థితి ఏర్పడింది..జియో చేసిన సంచలనానికి ఎన్నో నెట్వర్క్ సంస్థలు దుకాణాలు సర్దేసుకున్నాయి.ముఖ్యంగా దిగ్గజ సంస్థ అయిన ఐడియా ,ఎయిర్టెల్ లు రెండూ జియోతో పొతే పడుతూ ఉన్నాయి అయితే..

 Image result for idea

జియో రాకతో కుదేలయిన సంస్థలు అన్ని ఇప్పుడు మళ్ళీ పుంజుకుంటున్నాయి..జియో తో కొద్దో గొప్పో పోటీ పడుతూ నెట్టుకొస్తున్న ఎయిర్టెల్ జియో తో గతకొంత కాలం నుంచీ డేటా విషయంలో కానీ టారిఫ్ ల విషయంలో గానీ పోటీపడుతోంది..అయితే ఇప్పుడు తాజాగా ఐడియా సైతం రంగంలోకి దిగింది..గతంలో ఉన్న ఆఫర్ల్ అన్నిటికంటే కూడా కళ్ళు చెదిరే ఆఫర్స్ ప్రకటించింది.

 Image result for idea vs jio airtel

ప్రీపెయిడ్ కస్టమర్ల బంపర్ ఆఫర్ ఇస్తూ  రూ.149 రీఛార్జ్‌తో 33జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లను అందిస్తోంది...కస్టమర్లకు ఈ ఆఫర్ వర్తించనుంది. ఎఫ్‌యూపీ కింద రోజుకు 250 నిమిషాలు, వారానికి 1000 నిమిషాలు మాత్రమే వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చు. ..అయితే త్వరలో 28 రోజుల వ్యాలిడిటీతో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో అందుబాటులో రానుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: