గూగుల్  సంస్థ మొదట్లో తన బ్రాండ్ తో మొబైల్ రంగంలో అడుగుపెట్టినప్పుడు ఆ మొబైల్స్ కి వినియోగాదారుల నుంచీ స్పందన లేదు.అయితే ఈ మొబైల్స్ రాను రాను హై టెక్నాలజీ తో రూపు దిద్దుకోవడంతో పాటు సామన్యుల బడ్జెట్ అనుగుణంగా ఉండటంతో వినియోగదారులు ఇప్పుడుడిప్పుడే ఈ ఫోన్స్ కొనడానికి ముందుకు వస్తున్నారు.

 Image result for google pixel 3

అయితే రోజు వారి మార్కెట్ కి వినియోగదారుడి అభిరుచులకి తగ్గట్టుగా కంపెనీలు మొబైల్స్ ని తయారు చేసుకుంటూ ఉంటాయి...అయితే ఈ క్రమంలోనే గూగుల్ సంస్థ రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టబోతున్నట్లు పేర్కొంది. అక్టోబర్ 9న న్యూయార్క్ సిటీ వేదిక జరగనున్న ఓ కార్యక్రమంలో గూగుల్ పిక్సెల్ 3, గూగుల్ పిక్సెల్ 3 ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది.

 Image result for google pixel 3

అయితే ఈ గూగుల్ పిక్సెల్ 3 స్మార్ట్‌ఫోన్ రూ. 53,400, గూగుల్ పిక్సెల్ 3 ఎక్స్ఎల్ ఫోన్ రూ. 64,300 లభిస్తోందని కంపెనీ  స్పష్టం చేసింది. రెండు గూగుల్ స్మార్ట్‌ఫోన్లు మల్టీపుల్ కలర్ల అప్షన్లలో ఉంటాయని, బ్లాక్, వైట్ రంగుల్లో రూపొందించినట్లు కంపెనీ తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి: